Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రైతు క్షేమమే లక్ష్యం

tractor

*చెరువు పూడిక తీత పనులను ప్రారంభించిన స్పీకర్
*సిరికొండ మధుసూదనాచారి

మన తెలంగాణ/చిట్యాల: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని, వారి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. చిట్యాల మం డల కేంద్రంలోని మిషన్ కాకతీయ పథకం కింద రూ.35 లక్షల నిధులతో దివారం ఎదుగుల కుంట చెరువులో ఆదివారం పూడి కతీత పనులను స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్ర భుత్వం కోట్లాది రూపాయల నిధులతో రా ష్ట్రంలోని చెరువులన్నింటిని యుద్ధప్రాతిపది కన అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నా రు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తు ం దని గత ప్రభుత్వాలు చెరువులు, కుంటలను పట్టించుకోకపోవడంతో గ్రామాలు ఎడారిగా మారయని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వంలో పంట పొలాలు సస్యశ్యా మలం చేయాలనే తలంపుతో మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి నాలుగు విడతలుగా చెరు వులు మరమ్మతు చేసి దేశంలోనే పలువురి ప్రశంసలు అందుకున్న తీరు ముఖ్యమంత్రికే దక్కిందన్నారు.
రబి, ఖరీప్ సీజన్‌ల్లో రైతులకు ఎకరానికి రూ.4వేలు చొప్పున రెండు విడతుగా పెట్టు బడి కింద సహాయం అందజేయడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ చైర్మన్ కుంభం రవీందర్‌రెడ్డి, టిఆర్ ఎస్ నాయకులు ఆరెపల్లి మల్లయ్య, పిట్టల సుధాకర్, పుల్లూరి సతీష్, బుర్ర రమేష్, ఉప్పుల కిరణ్, ముసాపూరి రవీందర్, అంకం నర్సయ్య, కొడెల రాయమల్లు, జన్నే యుగం దర్, గురుకుంట్ల కిరణ్, కనకం తిరుపతి, గుర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments