Home జయశంకర్ భూపాలపల్లి మారుమూల పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మారుమూల పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

 The goal of the government is to develop remote villages

మనతెలంగాణ/టేకుమట్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల పల్లెల అభివృద్ధే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తుందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి ఆదివారం అన్నారు. మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామం లో శనివారం పల్లె ప్రగతి నిద్ర సందర్భంగా విచ్చేసిన స్పీ కర్ సిరికొండ మధుసూదన చారి ఆదివారం ఉదయం గ్రా మంలోని వాడవాడలను కలియతిరుగుచూ ప్రజలకు సంబ ంధించిన సమస్యలను అడిగి తెలుసుకొని వాటికి తక్షణమే పరిష్కారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాఘవరెడ్డి పేట గ్రామంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలతో సమస్యలు అడిగి తెలుసుకొనే క్రమంలో పలు విద్యార్థినీలు పాఠశాలలో ఉన్న సమస్యలు స్పీకర్ దృష్టికి తీసుకురాగా స్పందించి సంబంధిత డిఇఓకు ఫోన్ ద్వారా విద్యార్థినీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా నిధులు కేటాయిస్తూ  అభివృద్ధి చేయడం జరుగుతుందని పల్లెల్లో గత పాలకుల నిర్లక్షం వల్ల కూరుకు పోయిన సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించడం కోసమే ఈ పల్లె ప్రగతి నిద్రలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం హయంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారిక్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఒంటరి మహిళ పింఛన్లు , గొల్లకురుమలకు సబ్సిడీ గొర్రెలు,ఎస్సీ, బిసి కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతను ప్రోత్సహించడం కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని అందులో బాగంగానే రాఘవరెడ్డి పేట గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. స్థానిక జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలకు రూ.19లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అలాగే గ్రామంలో పలు వాడలలో సిసి రోడ్ల మంజూరి,డబుల్ బెడ్‌రూం ఇండ్లకు ప్రజలనుంచి దరఖాస్తులు వచ్చాయని వాటిని త్వరలోనే మంజూరు చేస్తామని హామీచ్చారు.
రూ.25లక్షలతో మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు
నూతనంగా ఏర్పడిన మండల కేంద్రంలో రూ.25లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అలాగే మండలంలోని ఏడు లక్షల యాబైవేల రూపాయలతో మరోమూడు గ్రామాలకు మిని కమ్యూనిటీ హాల్‌లను మంజూరు చేయించడం జరిగిందని మండలానికి ఓకే రోజు కోటి 25లక్షల అభివృద్ది పనులకు సంబందించిన నిధులను వివిధ గ్రామాలకు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
పేద వైద్యవిద్యార్థిని ఆర్థిక సహాయం
మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన తోడెటి మౌనిక ఈ విద్యాసంవత్సరంలో ఉస్మానియ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించిన చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూదన చారిని ఆశ్రయించగా తన పరిస్థితిని తెలుసుకున్న స్పీకర్ సానుభూతితో ఆమెకు తక్షణ సహాయం 25వేలు అందజేసి మరోముప్పై ఆయిదు వేలు తర్వాత అందజేస్తానని మొత్తం 60వేలు ప్రతి సంవత్సరం చొప్పున అందజేస్తానని హామిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంగ శ్రీలత కుమారస్వామి,టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కత్తి సంపత్ ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి,రాఘవరెడ్డి పేట గ్రామశాఖ అధ్యక్షులు పసరగొండ లక్ష్మన్,మండల నాయకులు పల్సర్ రమేష్,రైతు సమన్వయ కమిటీ మండల కో- ఆర్డీనేటర్ కూర దేవేందర్ రెడ్డి,సర్పంచ్‌లు తోడేటి రవీందర్,ఒరంగంటి సదాకర్,ఏకు మల్లేష్,టీఆర్‌ఎస్ మండల నాయకులు కొలిపాక రాజయ్య,ఎండీ కంమ్రోద్దిన్,నందకొండ రాంరెడ్డి,పైడిపెల్లి సతీస్,మారపెల్లి కొమురయ్య,వరదాచారారి,ఎస్టీపి టౌలర్ తిరుపతి,గునిగంటి మహేందర్,నేరేళ్ళ రామక్రిష్ణ,తోట సాగర్,కట్ల లస్మయ్య,శాస్త్రాల తిరుపతి,గౌడ సమ్మయ్య,ఎలుకటి రాజయ్య,చెన్న సరోత్తం,గొల్లెపెల్లి సంతోష్,రఘుపతి,రాజయ్య,నూతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.