Search
Monday 24 September 2018
  • :
  • :

వ్యవసాయానికి స్వర్ణయుగమే

agriculture-farmer-image

ఎంపి బోయినిపెల్లి వినోద్

మనతెలంగాణ/మల్యాల: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసా య రంగానికి రాబోయేది స్వర్ణయుగమేనని కరీంనగర్ ఎంపి బోయినిపెల్లి వినోద్‌కుమార్ అన్నారు.శనివారం మండల కేంద్రంలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో ఎం పి వినోద్‌కుమార్, ఎంఎల్‌ఎ శోభలు హాజరై రైతులకు పె ట్టుబడి సాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ నీటి పారుదల కరెంటు, పంట పెట్టుబడి, మద్దతు ధర ఇవ్వడంలో కెసిఆర్ సర్కార్ పూర్తిగా విజయవంతం అయిందన్నారు.

ప్రతి 5వేల ఎకరాల భూమి పరిధికి ఒక ఎఇఓను నియమించి రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందజేయడం జరుగుతుందన్నారు. రైతులకు 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని, భద్రాద్రి, పాల్వంచా, యాదాద్రి, దామరచెర్ల, విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి, వినియోగంలోకి వస్తే కరెంట్‌నుఇతర రాష్ట్రాలకు విక్రయించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుంటుందన్నారు. ఈ కా ర్యక్రమంలో తహసీల్ధార్ శ్రీనివాస్, ఎండిఓ మల్హోత్ర, వి విధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొడిమ్యాల: భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వలేని వి ధంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని, కరీంనగర్ ఎంపి బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు.

కొడిమ్యాలలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో ఎంపి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం, ఓట్ల గురించి జిమ్మిక్కులు చేస్తున్నాయని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కో సం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ బొడిగె శోభ, జెసి రా జేశం,జడ్‌పిటిసి పునుగోటి ప్రశాంతి,ఎంపిపి స్వర్ణలత, స ర్పంచ్ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ల్యాగ ల రాజేశం, వైస్ ఎంపిపి రాజేశం, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గాలన్న, స్థానిక నాయకులు శ్రీనివాస్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments