Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ పాలన స్వర్ణయుగం

The Golden Age of KCR rule

ప్రతి ఇంటికి తాగునీరు
ప్రతి ఎకరాకు సాగునీరు: జూపల్లి

మనతెలంగాణ/ అలంపూర్ (ఉండ వెల్లి): తెలంగాణ సాధించిన అనంతరం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కెసిఆర్ మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి సుర క్షిత తాగునీరు, మన నీరు, మన వాటా కింద ప్రతి ఎకరాకు సాగునీరు అనే నినాదంతో ప్రాజెక్టులు చేపట్టారని పంచాయతీ రాజ్ శాఖా మ్రంతి జూపల్లి క్రిష్ణారావు స్పష్టం చేశారు. గురువారం ఉండవెల్లి మండల పరిధి అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్‌యార్డులో తాలూ కాలో మంజూరైన 214 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందని వివరించారు. ఉద్య మంలో కెసిఆర్ గాలికి కొట్టుకుపోతాడు అని విమర్శించిన కాంగ్రెస్‌పార్టీ, తెదే పాలు కెసిఆర్ గాలికి కొట్టుకొని పోయి కనుమరుగయ్యాయని ఎద్దేవా చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం లబ్దిదారులు లగ్న పత్రికలు ముద్రించిననాడే దరఖాస్తు చేసుకొని పెళ్లి నాటికి చెక్కులు పొందా లని కోరారు. దేశంలో 46 సంవత్సరాల పాలనలో 16 మంది ప్రధాన మంత్రు లు, ముఖ్యమంత్రిలు పాలించినా నాలు గు సంవత్సరాల కెసిఆర్ పాలన కింద దిగదిడుపే అన్నారు. ప్రధాన మంత్రు లు, ముఖ్యమంత్రులు చేయలేని ఎన్నో సంక్షేమ పధకాలను ప్రజా సంక్షేమానికై ప్రవేశ పెట్టాడని వివరించారు. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, రైతుల ఉత్పత్తులకు అవసరమైన గోదాములను అందుబాటులో ఉంచిన ఘనత కెసిఆర్‌కే చెల్లిందన్నారు. అలంపూర్ ఆర్‌డిఎస్ చివరి ఆయకట్టు రైతుల కన్నీళ్లు తుడిచేం దుకు తుమ్మిళ్ల పధకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు నడుం బిగించిన కెసిఆర్ రైతు పక్షపాతిగా నిలి చాడన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారు భాస్కర్, టిఆర్‌ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపి మందజగన్నాధం, మార్కెట్ కమి టి ఛైర్మన్ పటేల్ విష్ణువర్దన్‌రెడ్డి. ఎంఎ ల్‌సి దామోదర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ డాక్టర్ అబ్రహాం, ఉండవెల్లి టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎంఆర్‌ఓ లు మదన్‌మోహన్( ఉండవెల్లి) లక్ష్మి(అ లంపూర్)మునెప్ప(మానవపాడు) అలం పూర్ టిఆర్‌ఎస్ నాయకుల ఇస్మాయిల్, మార్కెట్‌డైరెక్టర్ అల్లాబక్ష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments