Home పెద్దపల్లి పలుకే బంగారమాయెనా.. సిఎం సారూ..!

పలుకే బంగారమాయెనా.. సిఎం సారూ..!

tak*అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ
నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం
*మీడియాతో మాటైనా మాట్లాడని వైనం

మనతెలంగాణ/మంథని: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అంతర్ భాగమైన మంథని మండలంలోని అన్నారం పుంపు హౌస్, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ పనులను గురువారం ముఖ్యమ ంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఛీఫ్ ఇంజనీర్ వెంకటే శ్వర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను సిఎంకు వివరించారు. అనంతరం కాళేశ్వరం ప్రా జెక్టు మ్యాప్‌ను సిఎం పరిశీలించారు. సిరిపురం బ్యారేజీ వద్ద అధికారులు సిఎం, మంత్రులు, అధికారులు కూర్చోవడానికి స్టేజీ సైతం ఏర్పాటు చేసినప్పటికి, సిఎం కూర్చోకపోగా మీడియాతో కనీసం మాటైనా మాట్లాడకుండా, దూరం నుంచి దం డం పెట్టి తిరుగుముఖం పట్టారు. దీంతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో పా టు ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకింత నిరాశకు లోనయ్యారు. వారి వెంట ప్ర భుత్వ సలహాదారు గడ్డం వివేకానంద, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎం ఎల్‌ఎలు దాసరి మనోహర్‌రెడ్డి, నల్లాల ఓదెలు, జడ్పి ఛైర్ పర్సన్ తుల ఉమ, ఎం ఎల్‌సిలు భాను ప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డిలతో పాటు పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు, పలు మ ండలాలకు చెందిన ఎంపిపిలు, జడ్పిటిసిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
గంట 20 నిమిషాలు ఆలస్యం..!
షెడ్యూల్ ప్రకారం సిఎం కెసిఆర్ అన్నారం పంపుహౌస్‌కు మధ్యాహ్నం 12.40 గం టలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నారు. సిరిపురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్స్ వద్ద రెండు హెలిక్యాప్టర్లు ల్యాండ్ కాగా సిఎం కెసిఆర్, సిఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధు, పెద్దపల్లి ఎం పి బాల్క సుమన్ తదితరులు దిగారు. అక్కడి నుంచి నేరుగా అన్నారం పంపుహౌస్ నిర్మాణ కంపెనీకి సంబంధించిన మెగా కంపెనీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అ క్కడ ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. అనంతరం అక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అన్నారం పంపుహౌస్ నిర్మాణ పనులను, ఆ తర్వాత సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిల్ల బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ నుంచి తిరిగి సిరిపురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వ ద్దకు సాయంత్రం 4గంటలకు చేరుకోగా, అక్కడ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా రామ గుండం బయలుదేరారు.
సిఎం పర్యటనకు పోలీసుల భారీ బందోబస్తు !
ప్రాజెక్టుల నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా మంథని మండలం సుందిల్ల బ్యా రేజీ, అన్నారం పంపుహౌస్ నిర్మాణ పనులకు వచ్చిన సిఎం కెసిఆర్ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. డిజిపి మహేందర్‌రెడ్డి, రామగుండం కమి షనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ఆధ్వర్యంలో పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, మంచి ర్యాల జిల్లాల నుంచి 250పోలీసు అధికారులతో పాటు వెయ్యి మంది సిబ్బంది సిఎం పర్యటనలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా భారీ బం దోబస్తు చేపట్టారు. సిఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పాటు పోలీసు అధి కారులు ఊపీరి పీల్చుకున్నారు.