Home వరంగల్ రూరల్ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

The Goverment Aim IS Rural Devlopments in Telangana

మన తెలంగాణ/దామెర : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో రూ.29.65 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు పనులను ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. పల్లెలే దేశానికి పట్టు కొమ్మలని భావించి వసతుల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. పేదవారికి ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌తో పాటు 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తుందన్నారు. పట్టుదారు పాసు పుస్తకాల కలిగిన ప్రతి రైతుకు రూ.5లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌తోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధికి చెందుతుందని, రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీనే గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కనుకుంట్ల శారధ జీవన్‌రావు, ఎంపిటిసి నేరెళ్ల కమలాకర్, ఎంపిపి గోపు మల్లిఖార్జున్, ఎంపిడిఓ నర్మద, తహసిల్దార్ సరిత, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జాకీర్ అలీ, ప్రదాన కార్యదర్శి శంకర్, మాజీ ఎంపిపి మల్లయ్య, మండల ఉపాధ్యక్షుదడు దాడి రమేష్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.