Home జయశంకర్ భూపాలపల్లి పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

The Government Aim IS Devlopment Of Villages

మన తెలంగాణ/ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంని మూరుమూల పల్లెల అభివృద్ధే  ద్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ ప్రభు త్వం పని చేస్తుందని తెలంగాణ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు.శనివారం రాత్రి ప ల్లెప్రగతి నిద్ర పోతుగంటి మోహన్ ఇంట్లో  చేసిన అ నంతరం ఆదివారం వెలిశాల గ్రామంలో వాడవాడల కలియ తిరగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్నిఅభివృధ్ధిలో ముందు వరుసలో ఉంచాలనే తపనతోనే నేను.. పాలకునిగా కా కుండ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్నానని ఆయన అన్నా రు.మండలంలోని వెలిశాల గ్రామంలో స్పీకర్ 37వ ప ల్లె ప్రగతి నిద్ర చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికే పల్లె ప్రగతి నిద్ర చేయడం జరుగుతుందని తెలిపా రు.గత పాలకులు  60ఏండ్లలో చేయని అభివృద్ధి పనులను నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం సీ ఎంకేసీఆర్ చేసి చూపించారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ లక్షంతోరాష్ట్రంలో అ నేక సంక్షేమ పథకాలైన రైతుబందు,కళ్యాణ లక్ష్మి, శాదీముభారఖ్, రైతు జీవిత పథకం,ఆసర,వృద్దప్యాఫించన్‌లాంటి ఎన్నో పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు, అంతర్గత సీసీ రోడ్లు జాతీయ ర హదారులు మిషన్‌భగీరథ ద్వా ర ఇంటింటికి మంచినీరు ఇవ్వ డం,మిషన్‌కాకతీయ చెరువుల పూడిక తీయడం లాం టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.భూపాలపల్లి నియోజక వర్గంలో గత ప్రభుత్వా లు చేయని అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నా రు.

నియోజకవర్గంలో నాకు అపారమైన అవగాహన ఉం దని ఇక్కడ పేదలు ఉన్నారని పెద్దంపల్లికి 95 డబ ల్ బెడ్‌రూ ఇండ్ల మంజూరి చేస్తున్నాని ఆయన తెలిపా రు. మండలంలో అనేక రకాల అభివృద్ధి పనులు చేయ డం జరిగింది అలాగే వెలిశాల గ్రామంలో 2కోట్ల 74 లక్షలతో వెలిశాల పెద్దంపల్లి వరకు తారు రోడ్డు మం జూరి చేయడం జరిగిందని అన్నారు.ఎస్సీ,బీసీ క మ్యూనిటి భవన నిర్మాణాలకు రూ. 5 లక్షలు మంజూ రి చేడం జరిగింది   మిషన్ కాకతీయ తో అనేక రకాలైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇంకా గ్రా మానికి కావలసిన అబివృధ్ది పనులను గుర్తించి అభివృ ద్ది చేయడం జరుగుతుందని అన్నారు.గత పాలకులు చేయని పనులు చేశాను చేస్తున్నాను స్పీకర్‌గా అత్యం త స్థానంలో ఉన్న నేను హైదరాబాధ్ కంటే నియోజక వర్గంలోనే ఉంటున్నాను రాష్ట్రంలో భూపాలపల్లి జి ల్లాను ప్రధమ స్థానంలో ఉంచడం కోసం ప్రయత్నం జరుగుతుందన్నారు.మీకు సేవ చేయడం నాఅదృష్టం గా భావిస్తున్నాని స్పీకర్ తెలిపారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి సంపత్, ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి,మం డల నా యకలు వంగ కుమారస్వామి,అందె కుమా ర్,నందికొండ రాంరెడ్డి, పైడిపెల్లి సతీష్,సర్పంచులు ఓరుగం టి సధాకర్,ఏకు మల్లేష్, శారధ చేరాలు,గునిమహేందర్,రాజయ్య,్లకొంరయ్య తదితరులు పాల్గొన్నారు.