Search
Wednesday 26 September 2018
  • :
  • :

ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

The government is committed to Muslim upliftment

మనతెలంగాణ/కరీంనగర్: ముస్లిం అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కరీంనగర్ ఎంపి బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం నగరంలోని జిల్లా ప రిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లీం మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎం పి వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ పా ర్టీ అధికారంలోనికి వచ్చిన నాలుగు సంవత్సరాల కాలం లో ఒక్క మతకల్లోలం అలజడులు జరగలేదంటూ ముస్లిం లఅక్షరాస్యతా శాతంపెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యవల్లనే సమాజంలో మార్పు వస్తుందనే న మ్మకంతో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముస్లిం కోసం ప్రత్యేకించి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆడపిల్లలను విద్యావంతులను చేస్తే రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే ఆలోచనతోనే ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందంటూ ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి లక్షా 10వేల రుపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా ముస్లీం నిరుపేద కుటుంబాలు ఉండకుండా చేయాలనేదే సిఎం కెసిఆర్ సంకల్పమని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ టైలరింగ్‌లో శిక్షణ పొందిన ప్రతి ముస్లిం మహిళ ఉపాధి పొందేందుకు చేపట్టిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం అభినందనీయమన్నారు. మైనార్టీ ఫై నాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అక్బర్‌హుస్సేన్ వారికి కుట్టుమిషన్లను అందించడమే కాకుండా ఉపా ధి చూపించాలన్నారు. ప్రభుత్వం స్కూలు పిల్లలకు అం దించే యూనిఫాంలను కుట్టి అందించే కాంట్రాక్టర్‌లను వారికి ఇప్పించేందుకు ప్రయత్నించాలని సూచించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్ మాట్లాడుతూ కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం కేవలం కరీంనగర్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చే పడుతున్నట్లు తెలిపారు. ముస్లిం యువతుల వివాహం చే యూతను అందించేందుకు చేపట్టిన షాదీముబారఖ్ ప థకం ముఖ్యమంత్రి తీసుకున్న ఓ విప్లవాత్మక నిర్ణయమని అన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటుబ్యాంక్‌గానే భావించాయి తప్పా వారి అభివృద్ధ్దికి చేసిందేమీ లేదంటూ తెలంగాణ సర్కార్ ముస్లిం ఉన్నతికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలుచేస్తుందన్నారు.
ఎంపి వినోద్‌కుమార్, జడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ చేతు ల మీదుగా ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రా వు, జడ్‌పిటిసి శరత్‌రావు, కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, శ్రీలత, మధు, తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments