Home వరంగల్ క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ph4

కాజీపేట : క్రైస్తవుల సంక్షేమ అభివృద్ధికి తెలంగాణ  ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కమరుద్ధీన్ అన్నారు. మంగళవారం కాజీపేట పట్టణం బాపూజీనగర్‌లోని అల్ఫా ఓమేగా చర్చిలో 26వ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సువార్త ఆశీర్వాద సభలు, మంగళవారం  ఘనంగా ముగిసాయి. చర్చి వ్యవస్థాపకులు జాన్ మార్కండేయ అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కమరుద్ధీన్ పాల్గొని మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్య మంత్రి కెసిఆర్ క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. 56 సంవత్సరాలుగా క్రైస్తవులపట్ల ఎప్రభుత్వం చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నారని, రాష్ట్రంలో చర్చిల మరమత్తులకు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు, చర్చిలలో మౌళిక వసతుల కల్పనుకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, క్రైస్తవులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.చర్చి సభ్యులు 200 గజాల స్థలం ప్రభుత్వం పరంగా ఇప్పించాలని వినతి పత్రం అందించారని,2 వందల గజాలు స్థలం సిరిపోదని 2వేల గజాల స్థలం ఇప్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాననని ఆయన అన్నారు. బిషప్ జాన్ మార్కండేయ మాట్లాడుతూ అల్ఫా ఓ మెగ మినిస్ట్రీస్‌ను రెండు కుటుంబాలతో స్థాపించినప్పుడు అనేక అవరోదాలను ఏదుర్కోన్నామని దేవుని కృపతో నేడు ఒక వెయ్యి కుటుంబాలతో అరాధనలు అనేక గ్రామాలు అనేక ప్రాంతాలలో జరిపిస్తున్నమని,15 చర్చిల్లో,20 అరాధనలు జరిపిస్తున్నమని ఇది ఏసుక్రీస్తు వల్లె సాద్యమైంద ని,దింతో పాటు వితంతువులకు నెలనెల ఆర్థిక సాయం అందిస్తూ,అనాధ బాలలకు వసతి కల్పిస్తున్నామని,అనేక గ్రామాలలో వైధ్యశిభిరాలు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నామని ఇది కేవలం ఏసు కృపతోనే జరుగుతుందని,ప్రతి ఒక్కరు ఇతరులప పట్ల ఏసు వలే క్షమా గుణం కలిగి ఉండాలని ఏసు చూపిన మార్గంలో జీవించాలని ఆయన అన్నారు. డిల్లీ నుంచి వచ్చిన రెవ,,రవిందర్ పాస్టర్ ఆరాధన,పాటలతో  భుక్తలను ఉత్తేజపరిచారు.రెవ,డాక్టర్  రోజ్‌మేరి జాన్ మాట్లాడుతూ స్త్రీల సమాజంలో మహిళలు క్రీస్తును పోలి జీవించాలని నిత్యం ప్రార్థనలతో దైవ చింతన కలిగి జీవించాలని అన్నారు.అంతకు ముందు  కెకు కట్ చేసి, క్వాయర్ వారిచే ప్రత్యేక కిర్తనలు ఆలపించారు.అనంతరం  మైనారిటి కార్పోరేషన్ సంస్థ చైర్మన్ కమరుద్ధీన్ ,వైస్ చైర్మన్ శంకర్‌లూక్‌ల బృందాలకు శాలువాలు కప్పి,పూల మాలలతో సన్మానించారు. ఈసం దర్భంగా ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటి కార్పోరేషన్ సభ్యులు బొమ్మల కట్టయ్య,సురేందర్ సింగ్,ఆర్షద్ అలీఖాన్, గౌస్ నూరియా, మైనారిటి వెలేఫర్ అధికారి రత్నవీరాచారి,పాస్టర్‌లు పోతుల సాంబయ్య, వి. నాగేశ్వరరావు, వెంకటస్వామి, ఎం.శ్రీనివాస్,చంద్ర మోహన్, ఎన్ శ్రీనివాస్, సికె,పిఎన్‌ఆర్, ఎల్లేష్,బొక్క రమేష్,గొర్రె గోపాల్, తదితరులు పాల్గొన్నారు.