Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం కృషి

The government is committed to village development

రూ. 20 లక్షలతో సిసిరోడ్డు పనులు ప్రారంభం
మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి
ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మనతెలంగాణ/మిర్యాలగూడ : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నల్లగొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని గోపసము ద్రంతండా, హట్యాతండా, కొత్తగూడెం, లక్ష్మి పురం గ్రామా ల్లో ఎంజీఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పను లను వారు ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. పార్టీలకతీ తంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలిన కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అధిక నిధులు కేటాయిస్తూ గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్షం గా సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని, అందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజ లందరూ ప్రభుత్వానికి అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి, జెడ్పిటిసి నాగలక్ష్మి సైదయ్య, వైస్ ఎంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు ఏడుకొండలు, చిట్టిబాబు నాయ క్, జొన్నలగడ్డ రంగారెడ్డి, శంకర్‌నాయక్, రాం దాస్, సైదానాయక్, రాంరెడ్డి, జగదీష్, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments