Search
Monday 24 September 2018
  • :
  • :

పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడం సరికాదు

SARPUNCH

మన తెలంగాణ/సంగారెడ్డి అర్బన్ : గ్రామ పంచాయతీ నిధులను ఫీజింగ్, ఎలక్ట్రిసిటీ బిల్లులను, 13,14వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సరికాదని రాష్ట్ర సర్పంచ్‌ల ఐక్యవేధిక అధ్యక్షుడు అందోల్ క్రిష్ణ డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ౩,4 నెలలుగా 13,14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల నిధులపై ఆంక్షలు పెడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లకు ఎలాంటి పనులు లేకుండా చేశారన్నారు.

14వ ఆర్థిక సంఘం నిధుల నుండి ప్రభుత్వం గ్రామ పంచాయతీల వీదిదీపాలు విద్యుత్ బకాయిలను ఇష్టానుసారంగా వసూలు చేస్తుందన్నారు. త్రాగునీటి బిల్లులు, మండల స్థాయిలో పనిచేసే చేతిపంపు మెకానిక్‌లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు నెలవారి జీతం కూడా పంచాయతీ నుండే వసూలు చేస్తున్నారని ద్వజమెత్తారు. అంతేకాకుండా సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఉండకూడదని రాష్ట్రప్రభుత్వ కోర్టు ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోవడం లేదని కోర్టును దిక్కరిస్తూ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఈవోపీఆర్‌డీలు, సర్పంచ్ పదవిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. గ్రామాల్లోని ప్రజలు సర్పంచ్‌లను తరిమికొట్టే పరిస్థితి నెలకొందన్నారు.

ఇప్పటికైనా ఫీజింగ్ మరియు ఈవోపీఆర్‌డీలను తొలగిం చాలని, జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలకు మూడు న్నర సంవత్సరాలు గడుస్తున్న నజరానా ఇవ్వడం లేదన్నారు. వేసవిలో నీటిఎద్దడి తీర్చిన గ్రామపంచాయతీ లకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని, ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలన్నారు. గ్రామపంచాయతీలో స్టాంపు డ్యూటీ, సీనరేజ్ బకాయిలను వెంటనే పంచాయతీలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సర్పంచ్‌లు సుమంగళిశేఖర్, రాజు, విజయ్‌జనార్థన్, బుచ్చిరాములు, వైఎస్‌ఆర్‌సీపి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నాగరాజు, బాలాగౌడ్, నర్సింలు, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రాజ్, భాస్కర్‌రెడ్డి, మాణియ్య, మనోహర్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments