Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎండిన పంటలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

cong

మనతెలంగాణ/కాల్వశ్రీరాంపూర్ : శ్రీరాంసాగర్ ఆయకట్టు క్రింద ఎండిన పంటలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చిందకుంట విజయరమణారావు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆయీ గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు.ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి అదికారులు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎస్‌ఆర్‌ఎస్‌పి నీటిని డిసెంబర్ 25 నుండి ఏప్రిల్ 15 వరకు అందిస్తామని ప్రకటన చేయడంతో రైతులు వరి సాగుతో పాటు అమతడి పంటలు సాగు చేశారన్నారు.కాల్వనీరు వస్తాయనే ఆశతో అప్పులు చేసి పంటసాగు చేస్తే నీరు అందక పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి ఎకరకు 20వేల నష్టపరిహారం అందిచాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.కేసీఆర్ పాలన ఆంధ్రపాలనను తలపిస్తుందని సమాఖ్య ప్రాంతాలకు తరలించక వెళ్ళి పెద్దపల్లి జిల్లాను ఎడారిగా మార్చదన్నారు.14 టీఎంసీల నీటిని మిడ్ మానేరులోకి 12 టిఎంసిల నీటిని లోయార్ డ్యాంకు తరలించి చివరి ప్రాంతాలైన ఓదెల,కాల్వశ్రీరాంపూర్ మండలాల రైతులను నట్టెటాముంచారాన్నరు.కాళీశ్వరం,నీటిని మెడిగడ్డ నుండి అన్నారు.సుందిల్ల,ఎల్లంపల్లి,నంది మేడారం ద్వారా మిడ్ మానేరుకు తరలించి అక్కడి నుండి మల్లసాగర్‌కు తరిలించే ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయాని ప్రజలు గుర్తించాలన్నారు.ఇక్కడి పంటలు ఎండిపోవడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిథులే బాధ్యత వహించాలన్నారు.మల్యాల గ్రామాపంచాయితీ పరిధిలోని జగ్గమపల్లేలో తీవ్ర మంచినీటి కోరత ఉందని వ్యవసాయ బావుల నుండి నీరు తేచ్చుకుంటున్నాయని మహిళలు మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు దృష్టికి తీసుకపోయారు.గతంలో 45 లక్షలతో వాటర్‌ట్యాంక్ పైపులైన్ నిర్మాణం చేయడం జరిగిందని నీటికోరత ఎలా వస్తుందని ఆయన ఆరా తీశారు.స్థానిక ప్రజాప్రతి నిధులు బాధ్యత వహించి నీటి కోరత తీర్చులన్నారు.ఆయన వెంట సింగిల్ విండో చైర్మెన్ వంగళ తిరుపతిరెడ్డి,నాయకులు పుప్పాల నాగర్జునరావు,మేడి అశోక్,గరిడె అశోక్,సాంభరావు,కుమార్‌స్వామి,తదితరులున్నారు.

Comments

comments