Home నాగర్ కర్నూల్ రైతులను రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయం

రైతులను రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయం

farmer-king-image

పదర: దేశానికే ఆదర్శం రైతుబంధు పథకం అని, రైతులను రాజులుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్థానిక ఎంఎల్‌ఏ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం ఉదయం మండల కేంద్రంలో రైతుబంధు పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అథితులుగా హజరైనా స్థానిక ఎంఎల్‌ఏ, జిల్లా కలెక్టర్‌లకు రైతులు ఘన స్వాగంతం పలికి సాంప్రధాయబద్దంగా ఎడ్ల బండ్లపై ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో స్థానిక ఎంఎల్‌ఏ గువ్వల బాలరాజు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో కలిసి రైతుబంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించి రైతులకు చెక్కులు, పాస్ బుక్ లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతు బిడ్డగా పుట్టి పేదల కష్ట సుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలనే ధృడ సంకల్పంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతుల ఆత్మస్థైర్యం పెంచి లాభసాటి వ్యవసాయాలు చేయడానికే విత్తనాలు, ఎరువుల కోసం పెట్టుబడిగా ఎకరానికి 4 వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు లో తమ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రైతులకు లాభసాటి వ్యవసాయం చేసుకోవడానికి, ఎరువులు, విత్తనాలకు పెట్టుబడిగా రైతుబంధు పథకం ఉపయోగపడుతుంది అన్నారు. సాగు చేస్తున్న భూమిపై రైతు మారితే వెంటనే రికార్డులలో కూడా మార్పులు చేప్తామని ఇప్పుడు పాస్‌బుక్కులు రాని రైతులు నిరాశ చెందవద్దని సవరణలు జరిపి అందజేస్తామని అన్నారు. అతి తక్కువ సమయంలో భూ ప్రక్షాళన జరిపి చెక్కులు అందజేస్తున్నామని తెలిపారు. రాబోవు రోజుల్లో రైతులు సమిష్టిగా ఉండి వ్యాపారులతో కలిసి పంటకు ధర నిర్ణయించుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 68 వేల మందికి, పదరలో 1674 మంది రైతులకు చెక్కులు, పాస్ బుక్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దొంగ పట్టాబుక్ లు తయారు చేయకుండా ముందస్తు జాగ్రతగ్తా18 హై సెక్యూరిటీ ఫీచర్స్ తో బుక్ లను ముద్రించారని ప్రజలకు వివరించారు. గత పాలకుల వల్లే రైతులకు ఈ దుస్థితి గువ్వల బాలరాజు గత పాలకుల నిర్లక్షం వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని గడిచిన 70 యేండ్లలో సంక్షేమం గురించి పట్టించుకోని నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ది కలిగి బంగారు తెలంగాణే ఆశయ సాధనగా ముందుకు సాగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం పదవుల కొరకే పనిచేస్తు ఎన్నికల రాజకీయం చేస్తున్నారని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికల కోసం పాకులాడే అవసరం తమకు లేదని తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం 8 నెలల్లో సమగ్ర సర్వే, భూ ప్రక్షాళన పూర్తి చేసి చెక్కులు, పాస్‌బుక్ లు అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే సొంతమని ఆయన తెలియజేశారు. మఫేంద్రనాధ్ ను ఆదర్శంగా తీసుకుని నియోజక వర్గ అభివృద్ది కి అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. చంద్రసాగర్ ప్రాజెక్టు సామర్థం పెంచి రాబోవు రోజుల్లో పదర, అమ్రాబాద్ ఉమ్మడి మండలాలకు సాటు నీరు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో అమరేందర్, ఏడిపీవో విజయలక్ష్మి, డీఎంఆండ్‌హెఛ్‌వో సుదాకర్‌లాల్, మార్కెట్ కమిటి చైర్మన్ పోఫం జయంతి, తహసిల్ధార్ లక్ష్మిదేవి, ఏవో సురేష్, సర్పంచ్ రాయ శ్రీనివాసులు, యంపిటీసి రాంబాబు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.