Home మహబూబ్‌నగర్ మధ్యాహ్న భోజనంలో గుడ్డు… ముట్టుకుంటే జిడ్డు జిడ్డు..!

మధ్యాహ్న భోజనంలో గుడ్డు… ముట్టుకుంటే జిడ్డు జిడ్డు..!

The government provides the nutritional supplements for public schools as midday meal

కోస్గి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంగా ప్రభుత్వం అందిస్తుంది. కోస్గి మండలంలో మధ్యాహ్న భోజనాన్ని గత సంవత్సరం నుంచి తాండూరుకు చెందిన సంపూర్ణ చారిటబుల్ ట్రస్టుకు ప్రభుత్వం అప్పగించింది. గడచిన విద్యా సంవత్సరంలో భోజనం సమయానికి ఆయా గ్రామాల పాఠశాలలకు అందక, అన్నంలో పురుగులు, ఉడికీ ఉడకని అన్నం, నీల్ల చారు ఇస్తున్నారంట్టు ఎన్నో సార్లు విద్యార్థులు రోడ్లపై భైటాయించి నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం మండల పరిధిలోని తోగాపూర్ ప్రాథమిక పాఠశాలకు సరఫరా అయిన మధ్యాహ్న భోజనంలో అందించే గుడ్లు జిడ్డు జిడ్డుగా ఉండి ఉడికీ ఉడకని గుడ్ల నుంచి నీరు బయటికి వస్తూ దుర్వాసన వెదజల్లడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినకుండానే ఇంటికి వెళ్లిపోయారు. సమస్య పై అధికారులకు మధ్యాహ్న భోజన సమస్యలు ఎన్ని సార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కోరుతున్నారు.