Home నల్లగొండ ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం

ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం

 The government that ignored election promises

కొండమల్లెపల్లిః- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తీగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కేతావత్ బీల్యానాయక్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పలు తండాలలో గడప గడప కార్యక్రమంలో భాగంగా తండాలలో పర్యటించారు. తండవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలు పూర్తీగా విస్మరించిందని గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి అమలు చేయలేదన్నారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి, ఉచిత విద్యా, అమలు చేయాలని కోరారు. దీంతో పాటు యువతకు ఇంటికోక ఉద్యోగం ఇస్తామని చెప్పిన సిఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు ఒక్కరి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఎద్దవ చేశారు. తండాలలో మంచినీరు, డ్రైనేజి లేక ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్‌నాయక్, చందునాయక్, నాగారాజ్ నాయక్,రమేష్, గోప్య తదితరులు పాల్గొన్నారు.