Search
Sunday 18 November 2018
  • :
  • :

పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

cong2

మనతెలంగాణ/సదాశివనగర్: గ్రామ పంచాయతీ సర్పం చ్ ఎన్నికలను పరోక్ష పద్దతిలో నిర్వహిస్తే కక్షలకు గ్రూపు రాజకీయాలక ఆజ్యం పోసినట్లవుతుందని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అద్యక్షుడు తాహెర్ బిన్ ఉందాన్ అన్నారు. సోమవారం మంండలంలోని పద్మాజివాడి చౌర స్తా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న పల్లెసీమల్లో పరోక్ష పద్దతి ద్వా రా ఎన్నికలు నిర్వహించడం అంటే గ్రామాల్లోని ప్రశాంతతను దూరం చేసినట్లే నన్నారు. ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే ప్రస్తుత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థలను అభివృద్ది చేసినట్లయితే ఎలాంటి పరిణామాలు జరగవని ఎలాంటి కొత్త చట్టాల అవసరం ఉండవన్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణ ఖచ్చితమనుకున్నప్పుడు మండల స్థాయిలో మరియు సంబందిత అన్ని వర్గాల వారితో విస్తృతంగా చిర్చంచాలని ఆయన స్పషం చేశారు. అలా కాకుండా పరోక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచ్‌లు వార్డు సభ్యుల నుండి ఎన్నికవ్వాల్సి ఉంటుంది.
దీంతో గ్రామాల్లోని బలహీన వర్గాల నాయకత్వం ఎదగకుండా పోతుందన్నారు. ప్రభుత్వం ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా స్పందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజక వర్గ అభ్యర్థి నల్లమడుగు సురేందర్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గడ్డ శంకర్, నాయక్, సదాశివనగర్ ఉమ్మడి మండలాల అద్యక్షుడు బద్దం శ్రీనివాస్, పద్మాజివాడి గ్రామాద్యక్షుడు తీగల నాగాగౌడ్, లింగారెడ్డి, బాల్‌రాజు, శివాజి రావ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments