Home పెద్దపల్లి కొలిక్కి రాని రేషన్ పంచాయతీ

కొలిక్కి రాని రేషన్ పంచాయతీ

The government will take a key decision today

నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
డిమాండ్లు తీర్చకుంటే సమ్మె అనివార్యమంటున్న డీలర్లు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
29లోగా డిడిలు చెల్లించకుంటే లైసెన్స్‌లు రద్దు

మనతెలంగాణ/పెద్దపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టిన రేషన్ డీలర్ల పంచాయతీపై నేడు హైదరాబాద్‌లో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అకున్ సభర్వాల్ నేతృత్వంలో జరుగనున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులు హాజరు కానున్నారు. డీలర్ల డిమాండ్లు ఆచరణ సాధ్యం కాకుంటే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధ్యానత సంతరించుకుంది.నేడు జరుగబోయె స మావేశంపై అటు అధికారులు,ఇటు డీలర్లు అతృతతో ఎ దు రు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లుకు ఇస్తున్న కమీషన్ షాపు నిర్వహణకు కూడా సరిపోవడం లేదని డీలర్లు ఆందోళన బాట పట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమీషన్ రూపంలో క్వింటాలుకు 70 చెల్లించాల్సి ఉండగా, 2015 నుంచి కేవలం క్వింటాలుకు 20 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డీలర్లకు రావలసిన 5 వందల కోట్ల కు పైగా బకాయిలను వెంటనే చెల్లించాలని, రేషన్ డీలర్లకు ఇకనుంచి కమీషన్ ప్రాతిపదికన కాకుండా గౌరవ వేతనంగా 30 వేలు చె ల్లించాలని ప్రదాన డిమాండ్లతో జూన్ ఒకటిన నుండి సమ్మెకు సిద్ధ పడ్డారు. ఇవే డిమాండ్ల పై గత సంవత్సరం అందోళన బాట పట్టగా సానుకులంగా పరిశీలంచి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తమకు హమి ఇ చ్చిన నేపద్యంలో ఆందోళన విరమించి సంవత్సరం గడుస్తున్నాసమస్య కొలిక్కి రాలేదని డీలర్లు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం మాత్రం రే షన్ డీలర్లు ఎక్కడా లేని గొంతెమ్మ కోర్కెలు కో రుతున్నారని, ఆచరణ సాధ్యం కాని డిమాండ్ల తో సమ్మె చేస్తె నష్ట పోయేది డీలర్లేనని అంటో ంది. ఈ నెల 27లోగా విధిగా డిడిలు చెల్లించకుంటె 28 తేదీన ఆర్‌డిఒల ద్వారా నోటీసులు అందజేసి, 29న రేషన్ డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేసేందుకు సాంకేతిక పరమైన అంశాలను పరిశీలిస్తోంది. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకులంగా లేకుంటె ఎంతటి పోరాటానికైనా సిద్ధమని డీలర్లు అంటున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
–సమ్మె విరమించని పక్షంలో జులై నెల రేషన్ సరుకులను పేద ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఎర్పాట్లను చురుగ్గా చేస్తోంది.జిల్లా స్థాయిలలో రెవిన్యూ,సివిల్ స ప్లై అదికారులతో సమావేశం నిర్వహించి ముందుకెలుతున్నారు. రూరల్ ఏరియాలో ఐకె పి,సెల్ఫ్‌హెల్ఫ్ గ్రూప్‌లతో,అర్బన్‌లో మెప్మా చే షాపులను నిర్వహించేందుకు అదికారులు ర ంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి రేషన్ షాపు ప రిధిలో ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారికి సరుకుల పంపిణిలో ఈ నెల 28,29 లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం,జులై 1 నుండి జులై 3 వరకు వారి నుంచి మీ సేవల ద్వారా చెల్లింపులు జరిపించి,జులై 5 నుంచి యదావిదిగా సరుకులు ప్రజలకు చేరేలా రెవిస్యూ,సివిల్ సప్లై యం త్రాంగం కసరత్తు చేస్తోంది.
అలాగే రేషన్ డీలర్ల వద్ద నున్న వేయింగ్ మిషన్లను మండల రెవిస్యూ అదికారులు జులై 1 లోపు స్వాధీనం చేసుకొని కొత్తగా సరుకు లు పంపిణీ చేసే కేంద్రాలకు అందించాలని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతె పోలీసుల సహకారం తీసుకోవాలని నిర్ణయిం తీసుకుం ది.ఎట్టి పరిస్థితిలోనైనా ప్రజలకు సరుకులు అందించాలని ప్రభుత్వం పట్టుదలతో ముందుకెలుతోంది.