Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వం దృష్టికి ప్రైవేటు పాఠశాలల సమస్యలు

జగిత్యాల టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్

10429435_312755118927302_4980440028335773345_nరాయికల్‌ః ప్రైవేటు పాఠశాలల కరస్పాండెట్లు ఏదుర్కోంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతానని జగిత్యాల టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.రాయికల్ వర్తక సంఘ భవనంలో ఆదివారం జిల్లా ట్రస్మా కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి హాజరైన డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు,ప్రభుత్వ పాఠశాలలను అధిగమించేలా ఫలితాలను సాధిస్తున్నాయని అన్నారు.

అన్ని పాఠశాలల కరస్పాండెట్లు ఐక్యతతో ఉంటేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో అనేక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమేనన్నారు. ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్ట నున్న కెజి టు పిజి విద్యను ప్రైవేటు పాఠశాల కు అనుసంధానం చేయాలని పలువురు కరస్పాండెట్లు కోరగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు,జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె.సంజీవరెడ్డి, సత్యనారాయణ,రాయికల్ ట్రస్మా నాయ కులు బాలే శేఖర్,కైరం సత్యంగౌడ్,మచ్చ గంగాధర్, కడకుంట్ల జగదీశ్వర్, హుజురా బాద్, సిరిసిల్లా, వేములవాడ, కరీంనగర్, కొరుట్ల, జగిత్యాల, తదితర ప్రాంతాల నుండి ప్రైవేటు పాఠశాలల కరస్పాండెట్లు పాల్గొన్నారు.

Comments

comments