Home హైదరాబాద్ ముగిసిన సెయిలింగ్ పోటీలు

ముగిసిన సెయిలింగ్ పోటీలు

The governor who will deliver presents today

నేడు బహుమతులను అందజేయనున్న గవర్నర్ 

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, ఏజిస్ ఆఫ్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తోన్న సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారంతో ముగిసాయి. ట్యాంక్‌బండ్‌లోని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ లో నేడు నిర్వహించనున్న హైదరాబాద్ సెయిలింగ్ వీక్-2018 ముంగిపు వేడుకల్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేయనున్నారు.

72రేసులు,198మంది సెయిలర్లు
గత నాలుగు రోజులుగా ఆరు విభాగాల్లో 72రేసులు జరిగాయి. దేశ వ్యాప్తంగా 198మంది సెయిలర్లు పాల్గొన్నారు. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ యాచింగ్ నోడ్(ఎవైఎన్), తమిళనాడు సెయిలింగ్ అసోసియేషన్(టిఎన్‌ఎస్ ఎ), నేషనల్ సెయిలింగ్ స్కూల్(ఎన్‌ఎస్‌ఎస్ భూపాల్), ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్(ఈఎంఈఎస్‌ఎ),అర్టిలరీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్(ఎడబ్లూస్‌ఎ),సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్(ఎస్‌ఎస్‌సి), యాచ్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్(వైసిహెచ్), ఇండియన్ నేవేల్ వాటర్ ట్రైనింగ్ సెంటర్ వైజాగ్(ఐఎన్‌డబ్లూటిసి),కార్ప్ ఆఫ్ ఇంజినీర్స్ సెయిలింగ్ క్లబ్(ఎన్‌డిఎఎస్‌సి), ఇండియన్ నేవెల్ వాటర్ ట్రైనింగ్ సెంటర్ గోవా(ఐఎన్‌డబ్లూటిసిజి), త్రిష్ణ సెయిలింగ్ క్లబ్(టిఎస్‌సి),ఇండియన్ నేవెల్ వాటర్ ట్రైనింగ్ సెంటర్ ముంబాయి(ఐఎన్‌డబ్లూటిసిఎం),ఇండియన్ నేవెల్ వాటర్ ట్రైనింగ్ సెంటర్ కొచ్చి(ఐఎన్‌డబ్లూటిసికె), ఈఎంఈ సెయిలింగ్ క్లబ్,బోపాల్(ఈఎంఈఎస్‌సి)లకు చెందిన 198 మంది సెయిలర్లు పాల్గొన్నారు.

ఎవైఎన్ హవా
నాలుగు రోజులపాటు హుస్సేన్‌సాగర్‌లో జరిగిన సెయిలింగ్ పోటీల్లో మూం బాయిలోని ఆర్మీ యాచ్ నోడ్ సెయిలర్లు సత్తాచాటారు. ఆరు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శరన కనబర్చారు. హైదరాబాద్ సెయిలింగ్ వీక్2018 విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ఫిన్‌క్లాస్ విభాగంలో మొదటిస్థానంలో గుర్జిత్ సిం గ్(ఎవైఎన్) మొదటి బహుమతిని గెలుచుకోగా, స్వతంత్రసింగ్(ఎవైఎన్) రెండో స్థానం,నవీన్‌కుమార్(ఎవైఎన్) మూడోస్థానాలను సాదించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎక్స్ విభాగంలో ప్రథమ బహుమతిని జిరోని కుమార్(ఎవైఎన్),రెండో బహుమతిని మన్‌ప్రీత్‌సింగ్(ఎవైఎన్),మూడో బహుమతిని కమలాపథి(ఈఎంఈఎస్‌ఎ)లు దక్కించుకున్నారు.లెసర్ రేడియల్ విభాగంలో దిలీప్‌కుమార్(ఈఎంఈఎస్‌ఎ) తొలిస్థానాన్ని దక్కించుకోగా,గితేష్(ఎవైఎన్) రెండోస్థానం,ఇస్రాజ్‌అలీ(ఎవైఎన్) మూడోస్థానాన్ని సొంతం చేసుకున్నారు. లెసర్ స్టాండర్డ్ విభాగంలో అ ద్భుత ప్రదర్శనతో మోహితీసైనీ(ఎవైఎన్) మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ము జాహిద్‌ఖాన్(ఎవైఎన్) రెండో స్థానం,గితేష్(ఎవైఎన్)మూడోస్థానంలో నిలిచా రు. లెసర్ 4.7 విభాగంలో ప్రథమ స్థానంలో రిషాబ్‌నాయర్(వైసిహెచ్), ద్వితీ య స్థానాన్ని సతీష్‌యాదవ్(ఎన్‌ఎస్‌ఎస్),తృతీయ స్థానాన్ని రాంమిలాన్‌యాదవ్(ఎన్‌ఎస్‌ఎస్)లు కైవసం చేసుకున్నారు. 470విభాగంలో అటుల్ లెండె,సిహెచ్‌ఎస్ రెడ్డి(ఎవైఎన్)ల జంట మొదటి స్థానాన్ని, ప్రవీణ్‌కుమార్, సుదాన్ష్‌శేకర్(ఐఎన్‌డబ్లూటిసిఎం)లజంట రెండోస్థానాన్ని, సో నుజాతవ్, ఆర్‌కెశర్మ(ఐఎన్‌డబ్లూటిసిఎం)ల జంటల మూడోస్థానాన్ని దక్కించుకున్నారు.