Home ఆదిలాబాద్ ఈ ‘జ్యోతులు’ సమష్టికి ఆనవాళ్లు

ఈ ‘జ్యోతులు’ సమష్టికి ఆనవాళ్లు

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని…

GRAMAJYOTHI_manatelangana1మన తెలంగాణ/నేరడిగొండ: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. పల్లెసీమలను ఆన్ని రంగాల్లో ఆభివృద్ధి చేయడం కోసం తలపెట్టిన గ్రామజ్యోతి ఈ ఆలోచనను కుమారి గ్రామస్థులు 20 ఏళ్ల క్రితమే గుర్తించి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామ పెద్దలు ప్రభుత్వం తమ సమస్యలు తీరుస్తారని ఎదురుచూడకుండా, గ్రామా భివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని దీనికి  గ్రామజ్యోతి అని నామకరణం చేసి అభివృద్ధి పనులను చేపట్టారు. 20 ఏళ్ల కిందట అరకొర నిధుల కారణంగా కుమారి గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. ఎటూ చూసినా సమ స్యలే. ఎలాగైనా సమస్యలను అధిగమించాలనే ఆలోచనతో 1995లో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఒర్స భూమన్న ను ఎన్నుకున్నారు. కులానికి ఇద్దరి చొప్పున 20 మంది సభ్యులతో గ్రామజ్యోతి కమిటీని ఏర్పాటుచేసుకున్నారు.
2006లో రూ.8లక్షలతో హన్‌మాన్, పోచమ్మ, బ్రహ్మంగారు ఆలయాలను గ్రామస్థులు స్వచ్ఛందంగా ప్రారంభించి సంత్స రంలోనే పూర్తి చేసుకున్నారు. ప్రతి సంవత్సరం హన్‌మాన్ మందిరం వద్ద ఉత్సవాలను జరుపుకుంటారు. గ్రామ ప్రజలం తా తమ పంటలను అమ్మకం చేయగా వచ్చిన సొమ్ములో కొం త అభివృద్ధి పనుల కోసం గ్రామజ్యోతికి జమ చేసేవారు. ఇలా గ్రామం మొత్తం ప్రజల సహకారంతో ఒక్కొక్క అభివృద్ధి పనిని ప్రారంభించారు. 2007లో గ్రామానికి వంతెన నిర్మాణం కో సం అవసరమైన మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశా రు. మూడు కోట్ల వ్యయంతో ప్రభుత్వం వంతెన పనులను ప్రారంభించింది. గ్రామంలో మండల పరిషత్ పాఠశాల మా త్రమే ఉండేది. పై చదువులకు విద్యార్థులు నేరడిగొండ, ఇచ్చో డ వెళ్లాల్సి ఉండేది. దీంతో జిల్లా పరిషత్ పాఠశాల భవనం కోసం రూ.2.50 లక్షలు వెచ్చించి రెండెకరాల స్థలాన్ని గ్రామ జ్యోతి గ్రామాభివృద్ధి కమిటీ కొనుగోలు చేసింది. ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్ ద్వారా రూ.16 లక్షలు విడుదల చేసింది. దీంతో 2010లో భవనం నిర్మాణ పనులను పూర్తి చేశారు. 2011లో పదో తరగతి వరకు విద్యార్థులకు పాఠశాల ప్రారం భించారు. 2013 రూ.2 లక్షల వ్యయంతో గ్రామంలో శ్మశాన వాటిక, స్నానపుగదులను నిర్మించుకున్నారు. బాల వికాస స్వ చ్ఛంద సంస్థతో కలిసి రూ.2.50 లక్షల వ్యయంతో రక్షిత మంచి నీటి ప్లాంట్‌ను నిర్మించుకున్నారు. గ్రామంలోని అంద రికీ మూడు రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తున్నారు.
గ్రామ జ్యోతిని ప్రారంభించి అభివృద్ధి
పనులను సాధించాం:
డోకుర్ భోజన్న విడిసి అధ్యక్షుడు
గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు గ్రామ జ్యోతిని ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను పరిష్కరించు కున్నాం. రెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వ హించి హన్‌మాన్ మందిరం 2007 నిర్మించుకున్నాం. ప్రతి పైసాకు పక్కగా లెక్క. ఇవే నాడు గ్రామ జ్యోతికి జీవం పోశా యి. ప్రజలంతా ఒక్కటై నిలబడడం వల్లనే సమస్యలను పరిష్క రించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడు తు న్న గ్రామజ్యోతి పల్లెలకు వెలుగులుపంచేలా పనిచేయాలి.
ఊరి బాగు కోరే గ్రామజ్యోతిని ప్రారంభించాం :
ఒర్స భూమన్న విడిసి అధ్యక్షుడు
1995లో గ్రామ జ్యోతిని ప్రారంభించాం. కొద్ది కొద్దిగా అభివృద్ధి చేస్తుకుంటూ వస్తున్నాం. గ్రామాన్ని ప్రగతి బాటలో నడిపి స్తున్నాం. ప్రజలందరి సహకరంతో అభివృద్ది పనులను చేపట్టాం. తలా ఒక చేయి వేసి సమస్యలను తొలగించుకు న్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గ్రామజ్యోతి పథకంలో అందరూ భాగ స్వా ములై గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి కృషి చేయాలి.

మన తెలంగాణ/వరంగల్: మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా గంగదేవిపల్లె నిలుస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని గీసుకొండ మండలంలో ఈ గ్రామం ఉంది. గ్రామప్రజల భాగస్వామ్యం, సమష్టి కృషి ఫలితంగా ఈ స్థాయి కి చేరుకుంది. ఈ గుర్తింపు, ప్రత్యేకతల వెనుక రెండు దశాబ్ధాల గ్రామ ప్రజల కృషి దాగి ఉంది. ప్రజలు సంఘటితమై సమస్యలను పరిష్కరించుకునే దిశగా పయనించి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా 1035 మంది. ప్రతీ పనికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడంతో వీరు ఈ ఉన్నతికి చేరుకున్నారు. గ్రామంలో 24 కమిటీలు పనిచేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. 1994లో గ్రామపం చాయతీగా ఏర్పడిన తర్వాత ఎన్నో ఆదర్శాలను అందిపుచ్చుకున్నది.
నేడు గ్రామజ్యోతి ప్రారంభం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం నేడు సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఈ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ గ్రామ ఆదర్శాలను దేశానికి చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి చేపడుతున్నారు.
సారాపై సమరం…మంచీనీటికి పరిష్కారం: గ్రామంలో సారా, గుడుంబా అమ్మకాలు నిషేదం. 1992 నుంచి ప్రజలు దీన్ని కలిసికట్టుగా అమలు చేస్తున్నారు. మంచినీటితో కటకటపడుతున్న ఈ గ్రామస్తులు కలిసికట్టుగా శ్రమించి, మూకుమ్మడి శ్రమదానం చేసి వాటర్ ట్యాంకును నిర్మించుకున్నారు. ఈ సంఘటన ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపింది. దీంతో గ్రామంలో 24 కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు.
ప్రతీపనికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. గ్రామంలో ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్డి ఉంది. – పరిసరాల పరిశుభ్రతకు ఇక్కడ పెద్దపీట వేస్తారు. 2004 నుంచి వందశాతం ఇంటిపన్నులు వసూలు చేస్తారు. గంగదేవిపల్లి అనేక అవార్డులు పొందింది. అప్పటి రాష్ట్రపతి అబ్డుల్ కలాం నిర్మల్ భారత్ గ్రామ పురస్కారాన్ని సర్పంచ్ రాజమౌళికి లభించింది.
సమిష్టి కృషి..సరైన మార్గదర్శనం: గ్రామ ప్రజల సమిష్టి కృషికి తోడు మాజీ సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రతినిధి, ప్రస్తుత ఉప సర్పంచ్ కూసం రాజమౌళి మార్గదర్శనం ప్రధాన భూమిక పోషించింది. పల్లెవాసులను సమన్వయం చేసి, సమిష్టిగా ముందుకు కదిలించడమనే నాయకత్వ పాత్ర ఇక్కడ ఆయనదే. సమస్యల పరిష్కారానికి మార్గదర్శనం చేస్తూ వారిని అందులో భాగస్వామ్యం చేయడం వల్లనే ఈ స్థితికి చేరింది. తనకు గ్రామ ప్రజలు సహకరించడం వల్లే ఈ స్థితికి వచ్చామని రాజమౌళి అన్నారు.
ఇప్పటికీ అదే బాటలో: సర్పంచ్ శాంతి
వచ్చిన పేరును నిలబెట్టుకుంటూ ముందుకు సాగడం అగ్ని పరీక్షలాంటిదేనని గ్రామ సర్పంచ్ ఇట్ల శాంతి చెప్పారు. ఈ విషయంలో గంగదేవిపల్లి ప్రజల ఆదర్శం ఉన్నతమైందన్నారు. ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా తమకు అండగా నిలుస్తున్నారని అన్నారు. చిన్న విభేదాలు వచ్చినా కలిసి మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుంటున్నట్లు ఆమె వివరించారు.

నేడు ‘గ్రామజ్యోతి’

వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభం

మన తెలంగాణ / హైదరాబాద్: అభివృద్ధికి నోచుకోని గ్రామాల రూపురేఖలను మార్చాలనే లక్షంతో ప్రభుత్వం చేపట్టిన ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్‌రావు వరంగల్ గంగదేవపల్లిలో సోమవారం శ్రీకారం చుట్టను న్నారు. రాష్ట్రవ్యాప్తంగా దత్తత తీసుకున్న గ్రామాలలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు గ్రామజ్యోతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గంగాదేవిపల్లిలో అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉదయం 11:45 నిమిషాలకు ముఖ్యమంత్రి గ్రామజ్యోతిని ప్రారంభిస్తారు. ఆయన స్వయంగా కాలినడకన గ్రామంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు. అక్కడి గ్రామ కమిటీల ద్వారా జరిగిన అభి వృద్ధిని స్వయంగా పరిశీలిస్తారు. గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొంటారు. అనంతరం నల్లబెల్లి మండలం మేడిపల్లిలో జరిగే రాంపూర్-మేడిపల్లి జంట గ్రామాల గ్రామసభలో ముఖ్య మంత్రి ప్రసంగిస్తారు. రాంపూర్ గ్రామానికి చెందిన యశోధా హాస్పిటల్స్ అధినేత గోరుకంటి సురేందర్‌రావు గ్రామాభివృద్ధి కోసం రూ. 50 లక్షల విరాళం ఇచ్చినందుకు ఆయనను ముఖ్య మంత్రి ఈ సభలో అభినందిస్తారు. ప్రధానంగా పచ్చ దనం, మద్యనిషేధం, గ్రామ కమిటీల పనితీరు తదితర అంశాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అక్కడి అధికా రులను, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకుంటారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన కార్య క్రమాలను ఇదివరకే ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్య మంత్రి హితోపదేశం చేసిన విషయం తెలిసిందే.