Home కలం తెలుగు విమర్శ తీరుతెన్నులు

తెలుగు విమర్శ తీరుతెన్నులు

Telugu-Critics

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు, ఈ ప్రక్రియల్లో “విమర్శ” అనేది తనదైన ముద్ర కలిగి, సాహితీవేత్తలను ఒకించుక సంకలి తపరిచి, సందిగ్ధతకు లోనుచేస్తుంది. తనకు తాను ఆత్మవిమర్శ చేసుకొమ్మంటుంది. అయితే రచయిత రాసిన ప్రతి అంశాన్నితూనికలో వేసి కొలతబద్దను నిబద్ధతతో చేసేది విమర్శ. విమర్శ అంటే ఆయా రచనలను వివేకంతో పరామర్శ చేయ డమని భావించాలి. మహాకవి కాళిదాసు కూడా తన మిత్రు డైన దిజ్ఞాగుని వివేచనకు ప్రాధాన్యమిచ్చి తన కావ్యా లను అంచనా వేసుకొనేవాడని ప్రతీతి. ఇక్కడ దిజ్ఞాగుడు కాళిదాసు రచనలకు ఆకురాయి లాంటి వాడు. అందుకు కాళిదాసు, దిజ్ఞాగుని విమర్శకు వెరిసేవాడని అనడం కన్నా, అతని అభిప్రా యాలను గౌరవించేవాడని అనుకోవాలి.
రచయిత తన రచన ఎంత బాగున్నప్పటికీ అందులోని రసస్పందనలను, అంతర్ భావనలను, అది అందించే సామాజికతను, తను ఎంచుకున్న అంశాన్ని స్పష్టంగా వ్యక్తీకరించాడా? లేదా! అని సందేహప డుతుంటా డు. అప్పుడే విమర్శ కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించ డం వలన ఆ రచనకు పరిణతి రావటానికి మార్గం ఏర్పడుతుంది.
మరి విమర్శ ఉద్దేశమేమిటి? ఎందుకు? ఏ విధంగా ఉపయోగం అనే ప్రశ్న ఉదయిస్తుంది. విమర్శ ఎందుకు అని ప్రశ్నించుకుంటే.. సృజనాత్మ కతను పెంపొందించడం, రచయిత సృజనాత్మ కతను బేరీజు వేయడం, అందులోని అంశాలపట్ల ఒక వేకువను కలిగించడం, ముందు ముందు జాగ రూకత నిమిత్తం హెచ్చరించడంగా పనిచేస్తుంది. ప్రస్తుతం కొందరు విమర్శకులమని భావిస్తున్న సా హిత్యకారులు ఒక నిరాకారమైన, నిర్లజ్జ భావనతో, అవగాహనలేమితో విమర్శను అందిస్తున్నారు. రచ యిత సృజనను మలినం చేస్తున్నారు. తాము రాసేది విమర్శనా? సమీక్షిస్తున్నామా? పరిచయం చేస్తున్నా మా? కేవలం ఉపరితల స్పర్శతో మమ అనిపించు కుంటున్నామా అనే అవగాహన ఉండాలి. ఆ అవగా హనలోపం సాహిత్యానికి మేలుకంటే కీడు చేస్తున్నది.
విమర్శకులలో దార్శనిక విమర్శకులు, అనుశీలన విమర్శకులు, వివేచనాత్మక విమర్శకులు, విశ్లేష ణాత్మక, వర్ణణాత్మక విమర్శకులుగా దర్శనమిస్తుం టారు. అయితే ఏ విమర్శకైనా పరమావధి సాహిత్యా న్ని మూల్యాంకన చేయడమే.
తెలుగు సాహిత్య విమర్శలో మొదటిది – పింగళి సూరన గురించి యస్. రంగయ్య చెట్టియార్ ప్రసంగోపన్యాసం (10-8-1892), నన్నయభట్టార కుడి గురించి పుదప్పాకం సుబ్రహ్మణ్య అయ్యర్ వాసం (17-9-1910) వేదం వేంకటరాయశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కట్టమంచి రామలింగా రెడ్డి, గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ, శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యులు, పింగళి లక్ష్మీకాంతం, గిడుగు సీతాపతి, గుంటూరు శేషేంద్రశర్మ, యస్వీ. జోగారావు, నిడదవోలు, సినారె, జి.వి.సుబ్ర హ్మణ్యం, సుప్రసన్న, కోవెల సంపత్కుమార, చేకూరి రామారావు, తుమ్మపూడి, వడలి మందేశ్వరరావు, గూడా శ్రీరాములు మొదలగువారిని ఈ సందర్భంగా మననం చేసుకోవచ్చు.
సాహిత్యంలో విమర్శ అనేది ఒక ప్రత్యేక అంశం. విమర్శ ఒక విధంగా సాహిత్య పరామర్శ. సాహిత్య పరామర్శ అనుకున్నప్పుడు నిజ జీవితంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులను పరామర్శించడం లాంటిది. పరామర్శించడం అంటే మంచి చెడులను అంచనా వేయడం. అలాగే సాహిత్యాన్ని (రచన)ను అంచనావేసి, అందులోని మౌలికతను, మూలాలను విప్పిచెప్పడం విమర్శ. అందువలననే విమర్శ అంటే విడమరచి అందించడం, రచనలోని సృజనాత్మక తను, అంశాన్ని ఎంతవరకు అధ్యయనం చేశాడు, అది ఎలా ప్రతిబింబించారో విమర్శ చెబుతుంది. విమర్శ చైతన్యవంతంగా ఉండటానికి విమర్శకునికి

వివేచన అంత అత్యవసరం. రచయిత తను తెలుసు కున్నది, తనలోని భావాలను ప్రకటిస్తాడు. కాని విమర్శకుడు రచయిత యొక్క భావనను, రచనాస క్తిని అందుకోవడానికి నిరంతర అధ్యయన శీలతతో వాటిని కొలత వేయాలి. విమర్శ జీవితాన్ని, వివేచన ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను శాసిస్తుంటుంది. కాబట్టి విమర్శకుడికి తను చేస్తున్న ప్రక్రియపట్ల, ఆ ప్రక్రియకు సంబంధించిన అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి.
అప్పుడే ఆ రచన స్థితిని, గతిని నిర్దేశిస్తుంది. వివేచనాత్మక విమర్శ పాఠకులకు వివేచనను కలిగిస్తుంది. అందువలనే సాహిత్యంలో విమర్శ అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఈ క్రియ నవల, కథ, కవితలా విస్పష్టమైనదిగా వెలువడలేదనే చెప్పాలి. ఎందుకంటే విమర్శ ప్రత్యేక అంశంగా పరిగణించబడుతుంది. విమర్శఅనేది ఆకురాయి లాంటిది. నవల, కథ, కవిత లాంటి ప్రక్రియలు విమర్శ అనే ఆకురాయి మీద గీచినప్పుడే, దానిలోని నాణ్యత తేలుతుంది. అందువలన ఆయా రచనకు నీడలా వెన్నంటే ఉంటుంది.
మరొక విధంగా చెప్పాలంటే, విమర్శ (థ్యాంక్ లెస్ జాబ్) కృతజ్ఞతలేని పని లాంటిది. ఇదలా ఉంచితే – ప్రస్తుతానికి వస్తే సాహిత్య వేత్తలకు ఒక సందేహం పట్టిపీడిస్తున్నది. నేడు సాహిత్య విమర్శ వస్తుందా? వస్తే దాని దృక్పథమేమిటి? కేవలంపైపైన స్పృశించడంతో పాటుగా, కొంత అధ్యయనశీల లోపం, మరికొంత దబాయింపు ధోరణి ప్రబలి సాహిత్య విమర్శ పక్కదారి పడుతున్నది. విమర్శ కులు అనుకుంటున్న వారు తాము రాసిందే వేదం అన్నచందంగా ప్రవర్తించడం మరొక కారణం. వీటిని దృష్టిలో పెట్టుకొనికాబోలు ఆచార్య రాచపా ళెం చంద్రశేఖర రెడ్డి కొన్ని కారణాలు చెప్పారు.
1.ప్రాచీన సాహిత్యాన్ని సంప్రదాయ దృష్టితో పరిశీలించి విమర్శనా మూసలో పరిచయానికే పరిమితి చేయడం. 2.తెలుగు విమర్శ ప్రశంసకు అంకితమైపోవడం. 3. ప్రస్తుత సాహిత్యాన్ని అంచనా వేయడానికి వర్తమానంలో వస్తున్న విమర్శ, అలంకారశాస్త్ర గ్రంథాలను, మారుతున్న ధోరణుల ను అధ్యయనం చేయకుండా పాత సంప్రదాయా లతోనే ఆలోచన చేయడం.4. విశ్వవిద్యాలయాలు ఉత్పత్తి చేసే సిద్ధాంత గ్రంథాల్లో ఏ సిద్ధాంతమూ ఉండకపోవడం, పేలవ మైన విమర్శ బయటికి రావడం.
ఈ సిద్ధాంత గ్రంథాల గురించి కోవెల సుప్రస న్నాచార్యులు “తెలుగులో పరిశోధన ఆత్మావలోకన” అన్న వ్యాసంలో “ఈనాటికీ పరిశోధక విద్యార్థులకు ఈ కృషిసరిగా తెలియకపోవటం వలన, ఆధార గ్రంథాలు, వ్యాసాలూ, ఇతర సామాగ్రి సాధార ణంగా అలభ్యం, అప్రాప్యం కావటం వలన కలుగు తుంది. దీనివల్ల పరిశోధన అనేక సందర్భాల్లో చర్విత చర్వణంగా తయారు అవుతుంది. అయితే ఇక్కడొక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ పరిశోధన గ్రంథాలన్నీ ప్రచురణ యోగ్యమేనా అనేది. అంటే ఇవన్నీ పరిశో ధక ప్రమాణాలకు సరితూగుతాయా? అనేది పైప్రశ్న కు ప్రేరకమైన మరొక ప్రశ్న. అంటే పరిశోధన ప్రమాణాలు ప్రాధాన్యం వహిస్తున్నాయి. నిజానికి అవే ప్రధానం.
అయితే – “యూనివర్శిటీలు పరిశో ధన పత్రాలలో నిర్దిష్ట ప్రమాణాలు నెలకొల్పలేకపో యాయి” అన్న అపవాదు అంతటా వినిపిస్తుంది. “అంతేకాదు పుటలకొద్ది ఎత్తి, తమదిగా చెప్పుకో వడం లాంటిది”. ప్రస్తుతం సిద్ధాంత గ్రంథమంటే తీసి, తీసి రాయడంగా అయిందని అనుకోవచ్చు. 5.ఆధునిక సాహిత్య విమర్శలో కుహనా ఆధునికులు -నేటి విమర్శకులకు విమర్శపట్ల సరియైన అవ గాహన లేకపోవడంతోపాటు, వివేచనాశక్తి లోపిం చడం, పుస్తకాన్ని పూర్తిగా చదువకుండా, రచయిత ఎంచుకున్న ప్రణాళికను పట్టించుకోకుండా రాసిపడే యడం జరుగుతుంది.
ఇక సమీక్షా విమర్శకు వస్తే – పుస్తక సమీక్ష – విమర్శలో భాగంగా పరిగణించడం ఒక ఆనవా యితీగా వస్తుంది. కాని నేడు పుస్తక సమీక్షలు సమీక్ష లుగా ఉండడంలేదు. కేవలం పుస్తకంలోని వ్యాసాల శీర్షికలను ఉటంకించడం, పుస్తకమును పైపైన స్పృశించడం చేస్తున్నారు. పైగా ఇందులో అక్షరదో షాలున్నాయని ఒక వాక్యం వేయడంవలన తను పుస్తకమంతా చదివినట్లుగా భ్రమకలిగించడం, పుస్తకమును సమీక్షించేవారు, తను సమీక్షించే గ్రంథంలోని అంశాన్ని, వ్యాసాన్ని స్పష్టంగా చూడ డం లేదు. ఇందువలన సాహితీలోకంలో “పుస్తక సమీక్ష” అంటే ఒక తేలిక భావన ఏర్పడుతుంది. అంతేకాదు, ఈ కుహనా ఆధునిక సమీక్షాకారుల వలన రచయిత శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర వుతుంది.
అమా యకుడైన రచయిత కనీసం తన పుస్తకం నలుగురికి తెలుస్తుందిలే అని సంతృప్తి పడుతున్నా డు. ఇలా జరుగడానికి కారణం గురించి ఆలోచన చేస్తే- పత్రికాఫీసుల చుట్టూ తిరిగే కవులకు, ఔత్సాహిక సాహిత్య కారులకు పుస్తకాలు అందించడం కారణం అయితే – మరొక కారణం- గతంలో పత్రికా సంపాదకులు సమీక్ష నిమిత్తం వచ్చిన పుస్తకాలను, వాటికి న్యాయం చేకూర్చగల వారికి పంపేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎదురుగా ఉన్న వారికి అందచేస్తు న్నారు. వారి శక్తిని గమనిం చడం లేదు. ఇక్కడ కుల, మత, వర్గ, జెండర్‌లతోపాటు, తరతమ భేదాలు బాగా పనిచేస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనివల్ల అనర్హుడు కూడా అందలం ఎక్కుతున్నాడు. గుర్తింపు రావలసిన వారికి గుర్తింపు రావడం లేదు.
ప్రస్తుతం విమర్శను సద్వివేచనతో, సహేతుకత తో, సహృదయభావ భూమికతో వెలువరించి నప్పుడే అది సత్ఫలితాలను అందించగలుగు తుంది. విమర్శను వెలువరించేటప్పుడు కేవలం రచనను మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి కాని రచయితను చూడకూడదు. అప్పుడే మంచి సమీక్ష/ విమర్శ వస్తుంది. ఇక్కడొక విషయం – కవులు, రచయితలు తమ రచనను వెలువరించడం వరకే తన బాధ్యత. తమ రచన మీద ఎలాంటి విమర్శ వచ్చినా తట్టుకోవాలి. విమర్శకుడు చెప్పిన మంచి చెడులను బేరీజు వేసుకొని తమ రచనను సాగించాలి. కాని విమర్శకుడితో తగవుపడకూడదు. సాహిత్య విమర్శను సచేతనంగా, ఆరోగ్యవం తంగా వెలువరించినప్పుడే దానికి సరియైన గౌరవం దక్కుతుంది. అంతేకాదు ఆ సాహిత్య విమర్శను తనరచనలో చూసుకొని, మనఃస్ఫూర్తిగా స్వీకరించి, ప్రోత్సహించినప్పుడు ఆరోగ్యవంతమై న సాహిత్యం వెలువడుతుంది. అప్పుడే అది కొత్తపుంతలు తొక్కి వెలుగుదారులను వేస్తుంది. సాహిత్య విమర్శ మీద ఉన్నగౌరవం రెండింతలు అవుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు అందరూ ఆలోచించాలి.