Search
Wednesday 21 November 2018
  • :
  • :

అలోవెరా జెల్‌తో శిరోజాలు పదిలం..

Hair-Fall

జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుండటం దాదాపు అందరి సమస్య. ఇలాంటప్పుడు కనీసం రెండు రోజులకొకసారైనా తలంటు స్నానం చేయాలి. జుట్టు మరీ జిడ్డుగా ఉంటే షాంపూ చేసుకోవడానికి ముందు నిమ్మరసం పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయాలి. వారానికి రెండు సార్లు ఆలివ్ ఆయిల్ రాసి తలస్నానం చేస్తే మంచిది. పొడిబారినట్లుగా అనిపిస్తే, అలోవెరా జెల్‌తో తరచుగా మర్దనా చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి. ఎండిన ఉసిరికాయ పొడిలో ఒక చెంచా గోరింటాకు పొడి, మెంతుల పొడి కలపాలి. దీంట్లో రెండు చెంచాల కొబ్బరిపాలు, కలిపి జుట్టుకు పట్టించి ఒక గంటపాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే దట్టమైన శిరోజాలు సొంతమవుతాయి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత రెండు స్పూన్ల వెనిగర్ తీసుకుని తలకు బాగా పట్టించి కడిగేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉంటాయి. చుండ్రుతో ఇబ్బంది పడేవారు రాత్రి పడుకునేముందు రెండు టీ స్పూన్ల వెనిగర్‌లో ఆరు టీ స్పూన్ల నీళ్లు కలిపి కుదుళ్లకు పట్టించి తలకు టవల్ చుట్టుకోవాలి. మార్నాడు మరోసారి ఇలాగే చేసి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. మందార పువ్వును పేస్ట్‌లా చేసి ఆ రసాన్ని జుట్టంతా పట్టించి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మందార ఆకుల్ని పొడి చేసి అందులో పెరుగు కలిపి తలకు పట్టించినా జుట్టు ఆరోగ్యంగా చక్కగా పెరుగుతుంది.

Comments

comments