Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

బంగారు తెలంగాణ సాధనకు కృషి : కెసిఆర్

CM-KCR

ఆదిలాబాద్ : బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. పలు ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డైట్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఐదు వందల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.10 లక్షలు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఆదిలాబాద్‌కు అదనంగా వెయ్యి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముథోల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రజల సౌలభ్యం కోసమే 31 జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు నెలల్లో 70 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన తెలిపారు. బోధ్ నియోజకవర్గంలో రూ.210 కోట్లతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. కడెం ప్రాజెక్టుకు రూ.870 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోధ్, ఖానాపూర్ నియోజకవర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు.

ఆదిలాబాద్‌లో మినీ ఏరో డ్రమ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. సాత్నాల ప్రాజెక్టుకు రూ.28 కోట్లు మంజూరు చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 24వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు. చెరువుల కోసం 500 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామన్నారు. చెరువుల ద్వారా 20 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుందని ఆయన చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్‌కు అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

The hard work to accomplish the golden Telangana: KCR

Comments

comments