Home తాజా వార్తలు హరితహారాన్ని.. విజయవంతం చేయండి…

హరితహారాన్ని.. విజయవంతం చేయండి…

 Harita Haram

 

హరిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయండి..
హరితహారంపై నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు
వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి

హరితహారాన్ని..
విజయవంతం చేయండి
వనపర్తి జిల్లాలోని ప్రతి నర్సరీ వందకు వంద శాతం మొక్కలు అందించేందుకు సిద్ధంగా ఉంచండి
నిర్దేశించిన లక్షంతో.. నర్సరీల్లో మొక్కలు పెంచండి
ఎపిఒ శేఖర్‌గౌడ్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ

వనపర్తి : వనపర్తి జిల్లాలోని ప్రతి నర్సరీ వందకు వంద శాతం మొక్కలు అందించేందుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ శ్వేతామహంతి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె తన ఛాంబర్‌లో హరిత హారం కార్యక్రమంపై జిల్లా అధికారులు, ఎంపిడిఒలు, ఎపిఒలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొక్కల పెంపకం, మొక్కల పంపిణీల్లో తేడా వస్తే క ఠిన చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన లక్షం ప్రకారం నర్సరీల్లో మొక్కలు పెంచడం తో పాటు వాటిని సరఫరా చేయాలని , ఈ విషయంలో తేడా వస్తే ప్రతి మొక్కకు అయిన ఖర్చును రీకవరి చేస్తామన్నారు.

ఎఈఒలు, హెచ్‌ఈఒలు నర్సరీల్లోని మొక్కలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల ని ఆదేశించారు. హరిత హారం మొక్కల నర్సరీల పెంపకంలో నిర్లక్షం,పురోగతి తక్కువగా ఉన్న కారణంగా ఎపిఒ శేఖర్‌గౌడ్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీస్ జా రీ చేశారు. ఎపిఒ, ఎంపిడిఒ, ఈసిలు ప్రతి ఒక్కరు మూడు నర్సరీల చొప్పున సందర్శించి నర్సరీల్లోని మొక్కలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఒ గణేష్, డిఎఫ్‌ఒ బాబ్జీరావు, డిపిఒ రాజేశ్వరి, డిఇఒ సుశీందర్‌రావు, జిల్లా వ్యవసాయాధికారిణి సుజాత, ఉధ్యాన వన శాఖాధికారి విజయభాస్కర్‌రెడ్డి, ఎంపిడిఒలు,ఎపిఒలు, తదితరులు హాజరయ్యారు.

The Harita Haram Program will Succeed