Home తాజా వార్తలు బీఎస్ మక్తాలో ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం

బీఎస్ మక్తాలో ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం

fire
* స్పందించిన బస్తీవాసులు, తప్పిన పెను ప్రమాదం

సోమాజిగూడ : బీఎస్ మక్తాలోని ఓ టిఫిన్ సెంటర్‌లో గ్యాస్‌లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం ఏర్పడింది. అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న బస్తీవాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు క్షణాల్లో మంటలు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన బస్తీవాసులు అందరూ ఏకమై నీళ్లు, మట్టి చల్లి సుమారు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికంగా నివాసం ఉండే సురేష్‌కుమార్ టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం హోటల్ తెరిచి కస్టమర్లకు టిఫిన్లు అందజేస్తున్నాడు. సుమారు 10 గంటల సమయంలో హోటల్‌లోని గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. హోటల్‌లో పనిచేస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మంటలు మొత్తం అదుపులోనికి వచ్చాకా తీరిగ్గా అగ్నిమాపక వాహనం రావడం గమనార్హం. దాదాపు ఈ అగ్నిప్రమాదంలో రెండు లక్షల వరకు ఆస్థినష్టం జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు.