Home మహబూబ్‌నగర్ భర్త కిరాతకం

భర్త కిరాతకం

lady
మృతదేహాం తరలింపు..
మనతెలంగాణ/రాజాపూర్‌ః నవాబ్‌పేట మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన బీమ్లా నాయక్, అతని భార్య నేనావత్ విజయలక్ష్మిలు కోర్టుకు హాజరై తిరిగి వెళుతూ మండల కేంద్రం శివారులోని ఓ పెట్రోల్ బంక్ ప్రాంతంలో ఆగి మద్యం సేవించిన అనంతరం విజయలక్ష్మి(30) ని భర్త బండరాయితో మోది హత్య చేయడంతో పాటు నిప్పంటించారు. అనంతరం గ్రామానికి వెళ్తున్న క్రమంలో కొల్లూర్ వద్ద విద్యుత్ స్థంబానికి బైక్ ఢీకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు. విజయలక్ష్మి కనిపించక పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన మహబూబ్‌నగర్ టు టౌన్ పోలీసులు ఆమే సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాజాపూర్ శివారులో ఉన్న విజయలక్ష్మి మృతదేహాన్ని శనివారం స్వాదీనం చేసుకున్నారు.