Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

asb

* డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు

బెజ్జూర్ : బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో మంగళవారం రాత్రి దుర్గం స్రవంతపై కిరోసిన్‌పోసి నిప్పంటించి దారుణ హత్యకు పాల్పడ్డ నిందితులకు తక్షణమే చర్యలు తీ సుకోవాలని డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు డి మాండ్‌చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ నిరుపేద మహిళ అయిన దుర్గం స్రవంత అనే మహిళ ఇంటికి నిప్పంటించిన సంఘటన గత వారం రోజుల క్రితం చోటుచేసుకుందని   ఆ బాధ నుండి తేలుకోకముందే  ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి దారుణహత్యకు పాల్పడ్డ వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ. 50లక్షల రూపాయలు  ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఆ యన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చెప్యాల నర్సింగ్‌రావు, సర్పంచ్‌లు రాకేష్, వసీఖాన్, విశ్వేశ్వర్, మాజీ సర్పంచ్, లింగయ్య, లింగాల శంకరయ్య, నాయకులు , మో తీరాం, తాళ్ల రామయ్య, సత్తిబాబు, దాసరి వెం కటేశం, సంతోష్, బండయ్య, గౌతమ్, మహేంద్, శ్రీరామ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments