Home తాజా వార్తలు మార్కెట్లకు దన్నుగా ఫార్మా, ఐటి

మార్కెట్లకు దన్నుగా ఫార్మా, ఐటి

bsns

వరుసగా నాలుగో వారం లాభాల్లో సూచీలు

ముంబై: ఎట్టకేలకు మార్కెట్లు వరుసగా నాలుగో వారం లాభాల కూడా లాభాల ముగింపును ఇచ్చాయి. దేశీయ స్థూల గణాంకాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇతర అంశాలు సానుకూలంగా ఉండడం మార్కెట్లకు కలిసివచ్చింది. నిఫ్టీ సూచీ ట్రేడింగ్ 300 పాయింట్ల శ్రేణిలో(10,500 నుంచి-10,800) కదలాడింది. బెంచ్‌మార్క్ సూచీలు అర శాతం మేరకు లాపడ్డాయి. మార్కెట్లకు ఐటి, ఫార్మా సెక్టాలు దన్ను నిలువడంతో లాభాల పరంపరం కొనసాగింది. గత వారాంతం శుక్రవారం సెన్సెక్స్ 178 పాయింట్లు(0.5 శాతం) లాభపడి 35,622 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 50 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 10,818 వద్ద స్థిరపడింది. గత వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావు శాతం వడ్డీ రేటును పెంచడంతోపాటు ఈ ఏడాది మరో రెండుసార్లు పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. క్రితం వారంలో బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ సూచీ 0.15 శాతం బలహీనపడగా, స్మాల్ క్యాప్ 0.5 శాతం పెరిగింది. సెన్సెక్స్ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 14 శాతం పెరిగింది. సుబోగ్జోన్ జనరిక్ వెర్షన్‌కు అమెరికా ఎఫ్‌డిఎ ఆమోదం తెలపడంతో ఈ షేరు లాభాలతో దూసుకెళ్లింది. సన్ ఫార్మా 8 శాతం లాభపడగా, ఐటీ దిగ్గజం టిసిఎస్ బైబ్యాక్ ప్రకటన నేపథ్యంలో 5.4 శాతం ఎగసింది. ఇదే బాటలో ఇండస్‌ఇండ్ 4 శాతం పెరిగితే, ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, ఐసిఐసిఐ 5-2 శాతం మధ్య క్షీణించాయి.
ఆందోళనకరంగా స్థూల గణాంకాలు
మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.9 శాతానికి పెరిగింది. అలాగే డబ్లుపిఐ(వినిమయ ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.43 శాతంతో 14 నెలల గరిష్ఠానికి చేరింది. మరోవైపు ఏప్రిల్ నెలకు గాను ఐఐపి(పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) 4.9 శాతం నమోదవగా, ఇంతకుముందు నెలలో ఇది 4.6 శాతంగా ఉంది. ఇప్పటిదాకా మాటల యుద్ధంతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌లు ఎట్టకేలకు సింగపూర్‌లో సమావేశం అయ్యారు. వీరి భేటీ విజయవంతం కావడం ప్రపంచ మార్కెట్లకు ఊరటనిచ్చింది. మే నెలలో వాణిజ్య లోటు 15 బిలియన్ డాలర్లను తాకడంతో డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడింది. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పిఐలు) అమ్మకాలు పెరగడంతో వారాంతాన దేశీ కరెన్సీ, స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 75 డాలర్ల స్థాయిలో కదులుతుండటం కూడా వాణిజ్య లోటుకు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఎఫ్‌ఫిఐ, ముడి చమురు అంశాలపై దృష్టి
ఆర్‌బిఐ(భారతీ రిజర్వ్ బ్యాంక్) రెపో రేటును 0.25 శాతం పెంచింది. అయితే టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతానికి చేరడంతో మరోసారి వడ్డీ రేట్ల పెంపు చేపట్టవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ వారం ప్రధానంగా ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) ధోరణి, రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు వంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం పెంచడంతో 1.75 -నుంచి 2 శాతం మధ్య శ్రేణికి రేట్లు చేరాయి.

వచ్చే వారాల్లో ఒడిదుడుకులుంటాయ్: నిపుణులు

bn

వచ్చే వారంలో స్టాక్‌మార్కెట్లు హె చ్చుతగ్గులకు లోనవవచ్చని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లను ప్ర భావితం చేయగల ప్రధాన అంశాలు పెద్దగా లేనప్పటికీ ప్రతికూల, సానుకూల అంశాల మధ్య సూచీలు ఇప్పటికీ ఒడిదుడుకులకు లోనవుతాయని అంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా ఉండడం, ఈసారి వర్షాలు మెరుగ్గా ఉంటాయే వాతావరణ శాఖ అంచనాలు దేశీయ మార్కెట్లకు సానుకూలంగా ఉన్నాయి. మరోవైపు రూపాయిడాలర్ బలహీ నం, ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు, అమెరికాచైనా వాణిజ్య యుద్ధం ఆందోళనలు మార్కెట్ల జోరుకు బ్రేక్‌లు వేయనున్నాయి.