Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

శ్రీలంక వన్డే సిరీస్‌లో కోహ్లికి విశ్రాంతి

 kli

రోహిత్ శర్మకు సారథ్యం
 మూడో టెస్ట్, వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

నాగ్‌పూర్: శ్రీలంక జట్టుతో వచ్చే నెల జరగనున్న అంతర్జాతీయ వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెస్ట్ తీసుకోనున్నాడు. కానీ అతడు ఢిల్లీలో జరగనున్న మూడో, ఫైనల్ టెస్టు ల్లో ఆడనున్నాడు. వచ్చే నెల సొంతగడ్డపై జరగనున్న వన్డే సిరీస్‌కు భారత్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండనున్నాడు. ఈ విషయాన్ని బిసిసిఐ ప్రకటించింది. ప్రస్తుతం భారత్, శ్రీలంక మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మూడు వన్డే సిరీస్ డిసెంబర్ 10 నుంచి ధర్మశాలలో ఆరం భం కానుంది. ఢిల్లీలో డిసెంబర్ 2 నుంచి మూ డో, ఫైనల్ టెస్టులు జరగనున్నాయి.
మూడో టెస్టుకు భారత్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కె.ఎల్.రాహుల్, శిఖర్ ధావన్, చెటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, విజయ్ శంకర్.
వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్యా రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎం.ఎస్.ధోని(వికెట్‌కీపర్), హార్దిక్ పాం డ్య, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్‌వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్.

Comments

comments