Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

భారత్ జయకేతనం

The Indian Under-19 team in Sri Lanka is yet another win

లంకతో అండర్19 క్రికెట్

కొలంబో: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత అండర్19 జట్టు మరో విజయం నమోదు చేసింది. శుక్రవారం శ్రీలంక అండర్19 జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ నిషా (95) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫెర్నాండో (56), పసిండు (20) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు 42.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అజేయ శకతంతో జట్టును గెలిపించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న యశస్వి 8 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దేవ్‌దుత్ పడిక్కల్ (38), పవన్‌షా (36), ఆర్యన్ (22) తమవంతు పాత్ర పోషించారు. దీంతో భారత్ ఘన విజయం సాధించింది.

Comments

comments