Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సిఎం క్యాంప్ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

cm-camp

సొంత భూ తగాదాలో న్యాయం కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి శనివారం వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యాదమ్మ అనే రైతును సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించడం సంచలనం సృష్టించింది. మాజీమంత్రి శంకర్రావు కొనుగోలు చేసిన నాగులపల్లి గ్రామంలోని దాదాపు పది ఎకరాల భూమిలో తమకు రావలసిన కౌలువాటా నిరాకరిస్తున్నారంటూ సిఎంకు ఫిర్యాదు చేయడానికి ఆమె వచ్చినట్టు సమాచారం.

మనతెలంగాణ / హైదరాబాద్:  సొంత భూతగాదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసేందుకు వచ్చిన ఓ మహిళా రైతు (40)ను  సెక్యూ రిటీ గార్డులు అడ్డుకోవడంతో  క్యాంపు కార్యాలయం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సకాలంలో అక్కడి సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆమెను కాపాడ గలిగారు. మహబూబ్‌నగర్ జిల్లాకు యాదయ్య అతని సోదరులు పుష్కరయ్యకు చెందిన 9.8 ఎకరాల భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్నారు. 2005లో పుష్కరయ్య ఈ భూమిని మాజీ మంత్రి శంకర్‌రావుకు విక్రయించారు. దీంతో తమకు కౌలు చట్టప్రకారం అందులో వాటా వస్తుందని వారు కోర్టులో కేసు వేశారు. రెండ్రోజుల క్రితం శంకర్‌రావు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకు న్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు తన భార్య యాదమ్మ ను నగరానికి పంపాడు. సిఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న యాదమ్మ కెసిఆర్‌ను కలవడానికి అక్కడి సిబ్బంది నిరాకరించడంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను రక్షించిన  సిబ్బంది అనంతరం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అక్కడి సిబ్బంది తీసుకెళ్లారు. దీంతో  జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆ మహిళకు న్యాయం చేయాలని సిఎం సూచించారు.

Comments

comments