Home సిద్దిపేట కెసిఆర్ కిట్ ..సూపర్ హిట్

కెసిఆర్ కిట్ ..సూపర్ హిట్

The KCR KIT scheme introduced by the Government

సిద్దిపేట: ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానా వెళ్లాలంటే ప్రజలు జంకేవారు. కాని రాష్ట్ర సర్కార్ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెద్ద పీట వేయడంతో ప్రజలు ప్రభుత్వ దవాఖాలపైనే మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది క్రిందట ప్రవేశ పెట్టిన కెసిఆర్ కిట్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతుంది. దీంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు గతంలో కంటే ఇప్పుడు గణనీయంగా పెరిగాయి. గర్బం దాల్చిన నుంచి డెలవరీ అయ్యేంత వరకు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటే సుమారు రూ. 60వేల వరకు ఖర్చు అవుతుంది. అదే ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అమ్మ ఒడి పథకంలో పాప పుడితే 13వేలు, బాబు పుడితే 12 వేల చోప్పున తల్లి ఖాతాలో జమ చేయడంతో పాటు రెండు వేల విలువ చేసే 16 రకాల వస్తువులు కలిగిన కెసిఆర్ కిట్ అందిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కెసిఆర్ కిట్ పథకం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా సాగుతుంది. కుటుంబ ఆర్ధిక సమస్యల కారణంగా గర్బీణీలు పనులకు వెళ్తున్నారు. ఈ సమయంలో తమ ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదు. గర్బీణీగా ఉన్నప్పుడు పౌష్టికాహారాన్ని తగినంత మోతాదులో తీసుకోవాలి, లేకుంటే ప్రసవం అప్పుడు రక్త హీనతతో బాధపడతారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య అధికంగా పెంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కోసం గత ఏడాది జూన్ 3 న తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ కిట్ అనే పేరుతో ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. సంవత్సర వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో 9830 కిట్ల ను పంపిణి చేశారు. ఈ కిట్ లో 2 వేల రూపాయల విలువ గల 16 రకాల వస్తువులు ఉంటాయి. అదే విధంగా జిల్లా లో 9400 మంది గర్బీణీ, బాలింతలకు 9.32 కోట్ల రూపాయలను వివిధ దశలలో ప్రభుత్వం అందజేసింది. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో 10727 డెలవరీలు కాగా ఇందులో 4792 సాధారణ డెలవరీలు కాగా, 5935 సీజరిన్ డెలవరీలు అయ్యాయి. ప్రైయివేట్ ఆసుపత్రులలో 3932 డెలవరీలు , 3409 సీజరిన్ డెలవరీలు కాగా 523 మాత్రమే సాదారణ డెలవరీలు అయ్యాయి. దీన్ని బట్టి చూస్తుంటే జిల్లా వ్యాప్తంగా 73 శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రసవాలకు వస్తుంటే ప్రయివేట్ ఆసుపత్రులకు 27 శాతం మంది మాత్రమే వెలుతున్నారు. ప్రభుత్వ ఆసుప్రతిలో ప్రసూతి చేయించుకున్న మహిళలను 102 వాహనంలో ఉచితంగా ఇంటి వద్దకు చేర్చుతారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందడంతో పాటు కెసిఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు ప్రవేశ పెట్టడంతో ఓపిల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని రాష్ట్ర సర్కార్ అశావర్కర్లు, అంగన్‌వాడీలతో ఎప్పటికప్పుడు గర్బీణీలకు అవగాహన కల్పిస్తున్నారు. గర్బీణీలతో పాటు వచ్చే సహాయకులకు కూడా ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సేవలు చాలా బాగున్నాయి
అర్బన ,అల్లీపూర్ గ్రామం ,చిన్నకోడూరు.
కెసిఆర్ కిట్ , అమ్మ ఒడి పథకాల ద్వారా మా లాంటి పేదలకు లబ్థి చేకూరుతుంది. నిరుపేదలు ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం: జిల్లా వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్
ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన వైద్యం అందుతుంది. ప్రైయివేట్ ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించకండి, ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే కేసీఆర్ కిట్ , అమ్మ ఒడి పథకాల ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. కొంత మంది ప్రైవేట్ వైద్యులు చెబుతున్న కల్లబెల్లి మాటలను నమ్మకూడదు, సిద్దిపేటలో అత్యవసర చికిత్స కోసం హైరిస్కు సెంటర్ ను ఏర్పాటు చేశాం. అవసరం అనుకుంటే తామే గాంధి ఆసుపత్రి రీఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.