Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఆగస్టు 1న లక్షా 116 మొక్కలు నాటాలి: కెసిఆర్

kcr

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమంపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, వీటికి అదనంగా అదే రోజు అటవీభూముల్లో మరో 20వేల మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో లక్షా 116 మొక్కలు నాటాలని, కావాల్సిన మొక్కలను ముందే సిద్ధం చేసుకోవాలి అధికారులకు సూచించారు. మొక్కలు నాటడానికి ముందే గుంతలు తీసి పెట్టాలని, మొక్కలు పెద్ద సైజులో ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో సహా అన్ని ఖాళీ ప్రదేశాలతో పాటు  ఇండ్లలో ఖచ్చితంగా మొక్కలు నాటాలన్నారు. ఇంట్లో ఎంత మంది సభ్యులుంటే అంతమంది తలా ఒక మొక్క చొప్పున నాటాలని చెప్పారు. ఇండ్లలో నాటడానికి కావాల్సిన మొక్కలను ఒకరోజు ముందే ఆ ఇంటికి చేర్చాలన్నారు. ఆగస్టు 1వ తేదీన అనుకున్న సమయానికి గజ్వేల్ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగాలి. సైరన్ మోగిన వెంటనే ముఖ్యమంత్రితో సహా అంతా ఒకేసారి ఎక్కడికక్కడ మొక్కలు నాటాలి. మైకుల ద్వారా, వాల్ రైటింగ్ ద్వారా, హోర్డింగుల ద్వారా, పెయింట్స్ ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎం నిర్దేశించారు. రోడ్ల పక్కన నాటే మొక్కలకు ట్రీ గార్డులు పెట్టాలని, పట్టణంలో తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చిమొక్కలను తీసేసి, మంచి మొక్కలను మాత్రమే పెంచాలని తెలిపారు. మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ద చూపిన వారికి అవార్డులు కూడా అందించాలని అని సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

Comments

comments