Search
Wednesday 21 November 2018
  • :
  • :

అంతరిక్షంలో షికారు

Apolo

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన  స్పేస్‌ఎక్స్ కంపెనీ ఫాల్కన్ హెవీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో స్పేస్‌ఎక్స్ సిఇవో ఎలోన్ మస్క్‌కు చెందిన టెస్లా కారు అంతరిక్షంలోకి వెళ్లింది. అంగారక గ్రహం సమీప కక్షలోకి ఇది చేరనుంది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నాసా అపోల్ మిషన్ ద్వారా 11 మంది సిబ్బందిని చంద్రునిపైకి పంపించిన ప్రాంతం నుంచే ఈ రాకెట్‌ను కూడా ప్రయోగించారు. సుమారు 23 అంతస్తుల  పొడవైన ఈ జంబో రాకెట్ మాక్ పేలోడ్‌గా కారును తీసుకెళ్లింది. ఫాల్కన్ హెవీలో అంతరిక్షంలోకి వెళ్లిన కారు టెస్లా కంపెనీ రూపొందించింది. ఇది ఎలక్ట్రిక్ కారు. లక్షల సంవత్సరాలపాటు సౌర వ్యవస్థలో ఉండిపోయే ఈ కారు డ్రైవర్ స్థానంలో స్పేస్‌సూట్ ధరించిన మనిషి నమూనా ఉంటుంది. ఓ ప్రయివేట్ కంపెనీ భూ కక్షను దాటి పేలోడ్‌ను పంపడం విశేషం.

Comments

comments