Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నిర్మల్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై హత్యచారం

The killed of a 10-year- minor girl in Nirmal district
నిర్మల్‌: దేశంలోని చట్టాలన్ని మహిళలపై జరుగుతున్న దాడిలో కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఉన్న, ఒక పక్క రోజుకు రోజుకు మహిళలపై దాడులు ఆగడం లేదు. దీనిలో భాగంగానే మైనర్ బాలికల పై హత్యచారం, హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చట్టాలు రూపొందిస్తున్నప్పటికి వరుసగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంలో 10 ఏళ్ల బాలికపై హత్యచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న తన కూతరు ఇంతలోపు మాయమై మరుసటి రోజు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోధనాలు గ్రామస్తులందరిని కంటతడి పెట్టించింది. దీంతో గ్రామస్తులు రహాదారిపై రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళ్లే సోన్ గ్రామానికి చెందిన తోట నరేష్ పద్మల రెండోవ కుమార్తె అయిన స్పందిన(10) శనివారం సాయంత్రం ఇంటి వద్ద కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన తోకల ప్రవిణ్(27) పై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో నిందితుడు ప్రవీణ్ ఆదివారం ఉదయం తానే అగాహిత్యానికి పాల్పడినట్టు పోలీసులతో చెప్పి, సంఘటన స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన తోకల ప్రవీణ్ మాయమాటలు చెప్పి శనివారం భైక్ గోదావరి సమీపంలోని కూచన్ పెల్లి గ్రామశివారుకి తీసుకెళ్లి హత్యచారం చేసి పసి పాపను హత్య చేశాడని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అంతే కాకుండా నిందితుడిని కూడా సోన్ నుంచి నిర్మల్ కు తీసుకోస్తుండగా గ్రామస్తులు సుమారు 2 కిమి॥ వరకు పోలీస్ వాహనాలను వెంబడించారు. అయితే గ్రామస్తులు నిందితుడిని కఠినంగా శిక్షించి ఉరి తీయాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తు జాతీయ రహాదారిపై రాస్తారోకో నిర్వహించి,సుమారు గంట సేపు గ్రామస్తులు మిట్ట మధ్యాహ్నం ఎండలో రోడ్డు పైనే బైఠాయించి నినాదాలు చేశారు. ఎఎస్పి దక్షిణామూర్తి, డిఎస్పి మనోహర్‌ రెడ్డి గ్రామస్తులకు ఎంత నచ్చజెప్పినప్పటికి వారు వినలేరు. దీంతో సుమారు 5 కిమి॥ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు రాస్తారోకోను విరమించుకున్నారు. కాగా తోట నరేష్ పద్మలకు మూగ్గురు పిల్లలు కాగా ఇందులో రెండోవ కుమార్తె అయిన స్పందన 5వ తరగతి సోన్‌లోని ప్రభుత్వం పాఠశాలలో చదువుతోంది .పద్మ నరేష్‌లకు పెద్దకూతురు,కుమారుడు ఉన్నారు.

Comments

comments