Home ఆఫ్ బీట్ వీడియోలు తెలుగు పాటతో విదేశీ గడ్డపై సత్తాచాటిన భారత డ్యాన్స్ గ్రూప్!(వీడియో)

తెలుగు పాటతో విదేశీ గడ్డపై సత్తాచాటిన భారత డ్యాన్స్ గ్రూప్!(వీడియో)

The Kings Dance Groupముంబైకి చెందిన ‘ది కింగ్స్‌’ అనే భారత డ్యాన్స్ గ్రూప్ ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ మూడో సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన టాప్ క్లాస్ డ్యాన్సర్లను వెనక్కి నెట్టి ఓ భారత డ్యాన్స్ గ్రూప్ విజేతగా అవతరించడం విశేషం. అది కూడా ఓ తెలుగు మూవీలోని పాటపై ‘ది కింగ్స్‌’ గ్రూప్ డ్యాన్స్ చేసి టైటిల్ గెలవడం మరో విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్‌’ చిత్రంలోని ‘వాడెవడన్నా వీడవెడన్నా’ అనే పాటపై అంతర్జాతీయ వేదికగా ‘ది కింగ్స్‌’ అనే భారత డ్యాన్స్ గ్రూప్ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా ఉన్న జెన్సీఫర్‌ లోపేజ్‌, నీ-యో, డెరెక్‌ హూగ్ వారి డ్యాన్స్‌కి ఫిదా అయ్యారు. ఈ డ్యాన్స్ వీడియోను ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ స్పందించారు. తాను సంగీతం అందించిన పాటికి అంతర్జాతీయ షోలో ప్రదర్శన ఇవ్వడం థ్రిల్లింగ్‌గా ఉందని పేర్కొన్నారు. థ్యాంక్స్.. లవ్‌ యు గాయ్స్‌. మీరు ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. కీప్‌ ‘రా’కింగ్‌’స్‌’ అని దేవిశ్రీ ట్వీట్‌ చేశారు.