Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

11కెవి విద్యుత్‌షాక్‌తో కూలీ మృతి

the-laber-death-of-11-kv-electric-power

పరిహారం చెల్లించాలంటూ
జాతీయ రహదారిపై బంధువులు ధర్నా

మనతెలంగాణ/ధర్మపురి: నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో కూలి పనికి వెల్లిన కూలీ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందిన సంఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధర్మపురి మ ండలంలోని రామయ్యపల్లె గ్రామానికి చెందిన దాసరిరాఖేష్(20)తల్లి తండ్రి శంకరమ్మ లక్ష్మణ్‌లు అతని చిన్నతనంలోనే మృతి చెందడంతో, అదే గ్రామంలో ఉంటున్న రాఖేష్ అక్క బావలైన కూస లావణ్య వేణుల వద్ద ఉంటూ కూలి పనులు చే సుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.ధర్మపురి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో నూతనంగా నిర్మాణం పనులు నడుస్తున్న గందే శ్రీనివాస్ ఇంట్లో సెంట్రింగ్ కూలి పనిచేయడానికి రాఖేష్ శనివారం ఉదయం వచ్చాడు. ఇంటి ఎదుట ఉన్న ఇనుప సలిగెను ఇంట్లోకి తీసుకువెళ్లే క్రమంలో, ఇంటి ముందు ఉన్న 11కెవి విద్యుత్ వైరుకు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాఖేష్ బంధువులు, గ్రామస్థులు ఘటన స్థలానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంటి యజమాని శ్రీనివాస్ నిర్లక్షం వల్లే రాఖేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. ఇంటి సమీపంలో ఉన్న 11కెవి వైర్లకు పివిసి పైపులు తొడిగి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆ రోపించారు. గతంలో ట్రాక్టర్‌తో మట్టిని పోస్తుండగా అదే వైరు తాకి మంటలు వచ్చాయని, పివిసి పైపులు తొడగాలని కాంట్రక్టర్‌కు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్షం చేశాడని బంధువులు ఆరోపించారు. ఎంత సేపటికీ ఇంటి యజమాని ఘటన స్థలానికి రాక పోవడంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్ బాదినేని రాజేందర్, టిడిపి రాష్ట్ర నాయకులు గడ్డం భాస్కర్‌రెడ్డి యజమానితో రూ.6 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన వి రమించారు. రాఖేష్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మపురి ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు.

Comments

comments