Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సివిల్ ఆసుపత్రిలో వైద్యుల కొరత

The lack of doctors at the Civil Hospital in Jayashankar Dist

మన తెలంగాణ/ చిట్యాల : ప్రతినిరుపేదకు వైద్యాన్ని అందించాలనే లక్షంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో అధికారుల నిర్లక్షంతో ప్రభుత్వంపై ప్రజలకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. నూతనంగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకే తలామానికంగా ఉన్న చిట్యాల సివిల్‌ఆసుపత్రి పేరుకు పెద్ద ఆసుపత్రిగా పేరున్న అందులో వైద్యులు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 18 మంది డాక్టర్లు ఉండాల్సిన ఆసుపత్రిలో ముగ్గురు మాత్రమే ఉండటంతో తీవ్రమైన అవస్థలు  పడుతున్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చొరవతో 30 పడకలు ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం ఆప్‌గ్రేడ్ చేయడం జరిగింది.  10 కోట్ల నిధులతో అన్ని హంగులతో ఆసుపత్రిని నిర్మించి గత వేసవిలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. 50 పడకలు ఆసుపత్రికి సరిపడ వైద్యులు, సిబ్బందిని కేటాయిస్తానని వైద్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి సభలో హామీ ఇచ్చినా  ఇంతవరకు ఎవరూ రాలేదు. గతంలో ఉన్న డాక్టర్లు ఇక్కడి నుండి బదిలీపై వెళ్ళడంతో  మిగిలింది ముగ్గురే. అందులో ఒకరు దంత వైద్యులు కాగా ఒకరు రెగ్యూలర్ , మరొకరు కాంట్రాక్టు వైద్యులు.  గతంలో ఒకే నెలలో 115 ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించిన చిట్యాల సివిల్ ఆసుపత్రి నేడు నెలకు 50లోపే ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే ఆసుపత్రిలో సరిపడా వైద్యులు సరిగా లేక పోవడంతో పాటు ఉన్న డాక్టర్లు వంతుల వారిగా వస్తున్నారు.

ఒక్కొక్క డాక్టర్ వారానికి నాలుగు రోజులు పనిచేస్తుండడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు కాంట్రాక్టు డాక్టర్లుగా  విధులు నిర్వర్తించిన డాక్టర్లకు నెలనెల వేతనాలు రాక పోవడంతో వారు ఆసుపత్రికి రావడం లేదు. దీంతో ఆసుపత్రిలో రోగులు ఏక్కువై డాక్టర్లు లేక పోవడం మూలంగా ఉన్నవారే ఇబ్బంది పడుతున్నారు.  గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆకునూరి మురళి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు అవగాహన కల్పించి  అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. సివిల్ ఆసుపత్రిలో బిపి చూపించుకోవడానికి చిట్యాల మండల ప్రజలు కాకుండా చుట్టూ ట్టూ, రేగొండ, మొగుళ్ళపల్లి మండలాల ప్రజలతో పాటు మరికొన్ని మండలాల ప్రజలు వస్తుండేవారు. కానీ 50 పడకలు ఆసుపత్రిలో ఆధునాతన పరికరాలు ఉన్న వైద్యం అందించే వైద్యులు లేక పోవడంతో పరికరాలు వినియోగించక మూలనపడిపోతున్నాయి.  స్త్రీలు, వైద్యులు ఉన్నా ఇబ్బందులు పడుతున్న గర్బీణిలు ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో కలెక్టర్   నిధులతో నియమించిన  ఇద్దరు స్రీల వైద్యనిపుణులు పనిచేస్తున్నారు. కాని ఉన్న ఫలితంగా వారు  సరైన వేళకు రాక పోవటంతో పాటు  ఉదయం 10 గంటలకు వచ్చి  మధ్యాహ్నం 2 గంటలకు వెళుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితులలో గర్భిణీ స్త్రీలు పురిటి నోప్పులతో రాగా స్త్రీల వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఏన్నో ఆశలతో వచ్చిన వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళవలిసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో గర్భిణీలతో వచ్చిన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వెనుతిరిగి వెళుతున్నారు. స్త్రీల వైద్య నిపుణులు వంతు ల వారీగా వారానికి నాలుగు రోజులు వస్తుండడంతో ప్రజలు ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం డ్యూటీకైనా వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని, ఐతే కొంతలో కొంతైనా గర్భిణీలకు లాభం చేకురుతుందని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments