Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రోత్సాహంతో రైతన్నలో ఉత్సాహం

lands of the beats are preparing

రైతుబంధుతో మురిసిన రైతన్న
నాడు బీడులుగా ఉన్న భూములు … నేడు సాగుకు సిద్ధ్దం
రైతుబంధు ప్రమాద బీమా 85శాతం పూర్తి
ప్రభుత్వ పథకాలతో 94శాతం రైతులు సంతృప్తి
వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్న యువత

మనతెలంగాణ/ సదాశివనగర్ : ఆరుగాలం శ్రమించే అన్నదాత ఎన్నో యేళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్నాడు. భూమినే నమ్ముకుని జీవిస్తున్న రైతు ప్రతియేటా పంటలు వేసే సమయంలో విత్తనాలు దొరకక సరైన సమయంలో యూరియా లభించక, పెట్టుబడికి డబ్బులు లేక అప్పులు చేస్తు భారంగా చేసిన వ్యవసాయం ప్రస్తుతం ఇష్టంతో చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపుపై ఆధునిక విధానాలతో పంటలు పండిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ పాలకులు రైతుల సమస్యలు పట్టనట్లుగా ఉండటంతో ధనిక, రైతులు మాత్రమే వ్యవసాయం ద్వారా అభివృద్ధ్ది చెందినట్లు చిన్నసన్నకారు రైతులుంటున్నారు. గ్రామాల్లో రైతులకు వ్యవసాయంపై అభిప్రాయం అడుగగా గతంలో పంటలు వేసే సమయంలో పెట్టుబడికి డబ్బులు లేక అప్పులు తెచ్చి పంటలు వేసే వాళ్లమని, అప్పులను కట్టలేక భూములను బీడుగా వదిలేసి వలసలకు వెళ్లెవాళ్లం. కెసిఆర్ సర్కారు రైతుల కొరకు పంట పెట్టుబడి సహాయం పథకం ద్వారా ఎకరంకు రూ. 4వేల చొప్పున రెండు పంటలకు 8వేలు అందించడంతో పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఇప్పుడు డబ్బులతో సంతోషంగా సాగు చేసుకుంటున్నామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ప్రతియేటా రైతాంగాన్ని అభివృద్ధ్ది చేయడానికి వివిధ పథకాలు అమలు చేయడం వల్ల దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగా చేసుకుంటున్నారు. రైతు చుట్టు భద్రత వలయంలా సంక్షేమ పథకాలు ఉండటంతో కలం పట్టిన యువత హలం పట్టడానికి సంతోషపడుతున్నారు. అందరికి అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలంటే ఇప్పటి ప్రభుత్వ పథకాలు నీరుగాకుండా కృషితో కొనసాగించాలని రైతులు కోరుకుంటున్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధ్ది చేసి రైతును రాజు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలు, తూములను మరమ్మత్తులు చేపట్టింది. రైతులకు రుణమాఫీతో ఆగ కుండా వారికి పంట పెట్టుబడి సహాయం కొరకు పెట్టుబడి పథకం వారి భూమి పత్రాలతో ఉన్న తప్పిదాలను సరిచేయడానికి భూప్రక్షాళన, ప్రమాదసమయంలో రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి 5లక్షల ఉచిత ప్రమాదబీమా పథకం, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇలా రైతుకు రక్షణగా ప్రభు త్వం చేస్తున్న కార్యక్రమాలతో ఇటీవల కాలంలో వ్యవసాయంలో పెను మార్పులు సంభవించాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో 12,363 మంది రైతులకు రైతుబంధు చెక్కులు అందించి 88శాతంతో ముందుండగా ఉచిత ప్రమాదబీమా కొరకు సర్వే చేసి 10.880 రైతులకు గాను 9,350 మంది వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు మండల వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు.

Comments

comments