Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

చిన్నారులు స్వచ్ఛభారత్

The little girls are swachch bharath program

తల్లాడ: ఆదివారం సెలవురోజును పురస్కారించుకోని చిన్నారులు స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసం వినియోగించారు. సామాజిక సేవాస్పూర్తితో చిన్నారులు స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టి పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రం చేశారు. తల్లాడ మండలం మల్లవరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దత్తత స్వీకర్త పదకోండు ఏళ్ళ బాలుడు దుగ్గిదేవర శ్రీరఘునందన్ ఆధ్వర్యంలో బాలబాలికలు స్వచ్ఛభారత్ నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ఆవరణంలోని పిచ్చిమొక్కలను తీసి వేసి, రేగు, గుబ్బకంప మొక్కలు, గాజుపెంకులు చెత్తను తొలగించారు. చిన్నారులకు అల్ఫహారాన్ని దాసరి వీరభద్రరావు యూత్‌ క్లబ్ అధ్యక్షుడు దుగ్గిదేవర అజయ్‌కుమార్, ముత్యాలరావు, పంపిణి చేశారు. కార్యక్రమంలో తుటారి సాయికిరణ్, శ్రీనిఖిల్, శ్రీరాములు, ఏడుకోండలు, అద్దంకి నగేష్, నవీన్, మోహినిదివ్వ తదితరులు పాల్గోన్నారు.

Comments

comments