Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాజోళి నేతన్నల రుణమాఫీకి కృషి చేస్తా: అబ్రహాం

The loan waiver for handloom workers is hard work

రాజోళి: రాజోళి చేనేత కార్మికుల కష్టాలను కళ్ళారా చూసానని వారి సమస్యలపై  పూర్తి అవగాహణ ఉందని, రుణమాఫీ కోసం అవసరమైతే కెటిఆర్ దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎంఎల్‌ఎ టిఆర్‌ఎస్ నేత అబ్రహాం అన్నారు. శుక్రవారం కార్మికుల సమస్యలపై నియోజవర్గంలోని రాజోళిలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా రాజోళి గ్రామంలోని చేనేత కార్మికులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయిలో చేనేత కార్మికుల కోసం రుణమాఫీ కార్యక్రమం చేపట్టిన బ్యాంకులు అందుకు సహాకరించడం లేదని కార్మికులు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. దీనికి స్పందించిన ఆయన వెంటనే జిల్లా జౌళిశాఖ ఏడి చరణ్‌కు ఫోన్‌ చేసి సమస్యను తెలుసుకున్నారు. రుణమాఫీకి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని, రుణాలకు సంబంధించిన వివరాలు తమకు అందలేదని అధికారులు తెలిపినట్టు మాజీ ఎంఎల్‌ఎ తెలిపారు. వెంటనే గ్రామంలోని రాజోళి అంధ్రాబ్యాంక్ మేనేజర్‌తో సమావేశమై చేనేత రుణాలకు సంబంధించి వివరాలను జౌళిశాఖకు వీలైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా మేనేజర్‌ను కోరారు. రెండు మూడు రోజుల్లో వివరాలను జౌళిశాఖ అధికారులకు విన్నవిస్తామని బ్యాంక్ మేనేజర్ తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిఅర్‌ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలే నన్ను ఆకర్షించాయని, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, 24గంటల విద్యుత్, ఎకరాకు నాలుగు వేలు సహాయం, కెసిఅర్ కిట్టు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేవని, దేశం చూపు తెలంగాణ వైపు చూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు నిషాక్, వీరేష్ చేనేత కార్మికులు పాల్గోన్నారు.

Comments

comments