Search
Wednesday 14 November 2018
  • :
  • :

అందాలు కోల్పోతున్న సల్పల వాగు

Salpala-Vaagu

మనతెలంగాణ/కాసిపేట: చుట్టూ కొండలు, కొండలపై భారీ వృక్షా లు, వాటి మధ్యలో గలగల పారే సేలయోర్లు, పచ్చని వాతవరణం, వెరసి దేవాపూర్ సల్పల వాగు అందాలు, మంచిర్యాల జిల్లా కాసి పేట మండలంలోని దేవాపూర్ ప్రాంతంలో నాడు ఒక విహార యాత్రకు అనూకూలంగా ఉన్న సల్పల వాగు ప్రాంతం నేడు కాలుష్య కోరల్లో చిక్కుకోని సల్పల వాగు రాళ్లు కంకరగా మారి పోయి చూడ ముచ్చటైన అందాలు నేడు కళవీహినంగా మారిపో తున్నాయి. గతంలో సల్పల ప్రాంతం అంటే ఒక పిక్నిక్ స్పాట్‌గా గుర్తింపు వుండేది. దూర ప్రాంతాలకు చెందిన ఎందరో పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, ఉద్యోగస్తులు, స్థానికులు సల్పల అందాలను వీక్షించేవారు.

కాల క్రమేణ సల్పల అందాలు కనుమరుగై పోతున్నాయి, దానిని పట్టించుకునే వారే లేక పోవ డంతో సల్పల ప్రాంతం కళాహీనంగా తయారవుతుంది. కాసిపేట మండలంలోని దేవాపూర్ సమీపంలో సల్పలవాగు అందాలను విరజిమ్ముతుంది ఇక్కడ సల్పల లాగ వుండే తెల్లని రాళ్లపై నీళ్లు జల జల రాలుతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. పర్యాటకులు నీటలో దిగి తమ లోకాన్నే మరచిపోయేవారు. తన్మయంతో ప్రజలు అనందంగా సాయంత్రం వరకు వుండి సల్పల అందాలను తమ మదిలో నింపుకొని వెళ్లెవారు. అలాంటి సల్పల ప్రాంతం దిన దినం కళా విహీనంగా తయారు అవుతుంది. ఇక్కడే దేవాపూర్ సిమెంటు ప్యాక్టరీ ఉండగా సిమెంటు కంపెనీని కూడా చూసేందుకు పర్యా టకులు తరలి వచ్చేవారు.

కాగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ కూడా సల్పల అందాలపై సీత కన్ను వేయడంతో నేడు సల్పల అందాలు వెల వెల పోతున్నాయి. ప్రస్తుతం సల్పల వాగులో కంపెనీకి సిమెంటు కొరకు, ఇతర ముడి సరుకులతో వచ్చే లారీలను క్లీనింగ్ చేస్తుండడంతో లారీల్లోని ఆయిల్ నీటిలో కలిసి పోతుంది, అలాగే వ్యర్ధ పదార్దాలను కూడా ఇక్కడ పార వేస్తుండడంతో సల్పల వాగు కలుషితం అవుతుంది. అంతే కాకుండా లారీ డ్రయివర్లు, క్లీనర్లు సబ్బులు, షాంపులు పెట్టి ఇక్కడే స్నానాలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం కాలుష్య కోరల్లో కొట్టు మిట్టాడుతుంది. దీంతో ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులు ఇటు వైపుగా చూడడం లేదు.

చుట్టు ఎతైన గుట్టలు, పెద్ద పెద్దని పచ్చని చెట్లు వాటి మధ్యలో సల్పల వాగు నీళ్లు పాలలాగ గలగల పారుతుంటే చూసి మైమరి పించే అందాలు నేడు లేకుండా పోయాయి. లారీలు కడుగుచుండ డంతో మురికి నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికైన సిమెంటు కంపెనీ, పర్యాటక కేంద్రం తమ ఆదీనంలోకి తీసుకుంటే సల్పల ఒక మంచి పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుందని పలువురు పేర్కోంటున్నారు. కేవలం ఆదివారం విందు వినోదాలకు మాత్రం అందరికి సల్పల ప్రాంతం ఆథిద్యమిస్తుండడం గమనారం.

Comments

comments