Home కరీంనగర్ ప్రియురాలి గొంతు కోసి హత మార్చిన ప్రియుడు

ప్రియురాలి గొంతు కోసి హత మార్చిన ప్రియుడు

The lover killed his girlfriend's throat cut killing
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలకలం చేలరేగింది. కలెక్టరేట్ ముఖ ద్వారం ఎదురుగా ఉన్నటువంటి ఓ మీసేవ కేంద్రంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలి గొంతు కోసి హతమార్చాడు. ఆనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకోవాలని చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుని అవేశంతో అతడికి దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. విద్యావంతుడైన ఆ యువకుడు విచక్షణ మరిచి క్షణీకావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ ప్రేమికుడిని కటకటాల పాలు చేసింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఊట్ల విష్ణువర్ధన్‌ విజయల కుమార్తె అయినటువంటి ఊట్ల రోషిణి అలియాస్ రసజ్ఞ (22) స్వగ్రామంలో డిగ్రీ వరకు చదువుకుంది.  కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామానికి చెందిన సిరంగి వంశీధర్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే గోదావరిఖని ప్రాంతంలోని ఓ మీసేవ కార్యాలయంలో రోషిణి పని చేస్తుండగా వీరి ప్రేమాయణం గురించి ఇరుకుటుంబాల సభ్యులకు తెలిసింది. పంచాయతీ నిర్వహించిన పెద్దలు ఇకా నుండి ఒకరికొకరు కలుసుకోవద్దని లిఖితపూర్వకంగా రాసుకోవడం జరిగింది.

రసజ్ఞ స్వగ్రామంలో ఉంటే ఎదైన జరగవచ్చు అనే ఆలోచనతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్‌కు పంపించగా ఆమె స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి ఓ మీసేవ కేంద్రంలో పనికి కుదిరింది. కాగా ప్రియురాలిని మరిచిపోలేక పోయిన వంశీధర్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పెద్దల నిర్ణయంతో భయపడిన రోషిణి అతనితో సరిగ్గా మాట్లాడక పోవడం, ఫోన్‌ చేసిన కట్ చేయడం లాంటివి చేస్తుండేది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న వంశీధర్ తనకు దక్కని రోషిణి మరేవరికి దక్కకూడదని నిర్ణయించుకుని ఒక పథకం ప్రకారం… ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. వేసుకున్న పథకం ప్రకారం ఓ కత్తిని వెంట తీసుకుని రోషిణి పనిచేస్తున్న మీసేవ కేంద్రం వద్దకు వచ్చి మాట్లాడాలంటూ బయటకు రమ్మని ఆమెను కోరాడు. అతని మాటలు నమ్మిన ఆమె బయటికి వస్తుండగా ముందుగా వెంట తెచ్చుకున్న కత్తితో రోషిణి గొంతుకోసి తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్నటువంటి మీసేవ యజమాని అతడిని అడ్డుకుని రక్తపు మడుగులో పడి ఉన్న రోషిణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా విషయం తెలిసిన చుట్ట పక్కల వారు హుటాహుటిన మీసేవ కేంద్రం వద్దకు చేరుకుని వంశీధర్ చేతులోని కత్తిని లాక్కుని పడేశారు. అంతే కాకుండా తీవ్రమైన ఆవేశంతో అతడికి దేహాశుద్ది చేశారు. మీసేవ కేంద్రం నిర్వాహకుడు రోషిణిని ఆసుపత్రికి తరలించగా ఆమె మార్గ మధ్యంలోనే మృతి చెందిందని తెలిసి రెచ్చిపోయిన స్థానికులు వంశీధర్‌ను మరింత చితకబాదారు.

సమాచారం అందుకున్న కరీంనగర్ వన్‌టౌన్ సిఐ తులా శ్రీనివాస్‌రావు హుటాహుటిన తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. విషయం నగరంలో వ్యాపించడంతో నగర వాసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించి ఏలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. కరీంనగర్ టౌన్ ఎ.సి.పి వెంకటరమణ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. రోషిణిని హతమార్చిన నిందితుడు వంశీధర్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేయగా, కరీంనగర్ వన్‌టౌన్ సిఐ తుల శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా