Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘మహానటి’ని చూసి అందరూ స్ఫూర్తి పొందాలి

mahanati

వైజయంతీ మూవీస్ పతాకంపై కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మహానటి’. నాగఅశ్విన్ దర్శకత్వంలో స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాజాగా వీక్షించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఓ ప్రత్యేకమైన అభినందన సభ నిర్వహించి ‘మహానటి’ చిత్ర బృందాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “దర్శకుడు నాగఅశ్విన్ దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా మీద పనిచేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్వప్నదత్, ప్రియాంక దత్‌లు చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకొని అఖండ విజయాన్ని సాధించారు. సావిత్రిగా కీర్తిసురేష్ అద్భుతంగా నటించారు. ఇక 16 ఏళ్లకే సినిమాల్లోకి ప్రవేశించిన సావిత్రి దాదాపు 30 ఏళ్లపాటు సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసి 46 ఏళ్లకే తుది శ్వాస విడిచారు. ఆమె అమరావతి పక్కనే ఉన్న చిన్న గ్రామంలో జన్మించడం అనేది సంతోషకరమైన విషయం. పల్లెటూరిలో పుట్టిన సావిత్రి మహానటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమనేది గర్వకారణం. ఈ సినిమా చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఆశిస్తున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తిసురేష్, నాగఅశ్విన్, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, అశ్వనీదత్, స్వప్నదత్, ప్రియాంకదత్,  మంత్రి అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments