Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

చదువుతోనే మార్పు :కలెక్టర్ సురేంద్రమోహన్

 The main guest of the Prathibha Awards Program

సూర్యాపేట : సమాజంలో ఏ రంగంలో రాణించాలన్న కృషి, పట్టుదల అవసరమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కిరాణం ఫ్యాన్సీ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో పద్మశాలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్త మార్కండేయ ప్రతిభ పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పద్మశాలి విద్యార్థినీ, విద్యార్థులు కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అరోహించాలని, సమాజంలోని పేదలకు సహాయం చేయాలన్నారు. చదువుతోనే సమాజంలో ఏదైనా సాధించవచ్చని చెప్పారు. విద్యలో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు స్వయంగా ఐదు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం అందించే సంక్షేమాధికారులను, రుణాలను పద్మశాలీలు వినయోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. పద్మశాలి సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఏలే వెంకట్‌నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణలో 20 లక్షలు మంది ఉన్న పద్మశాలి కులస్తులలో 173 చేనేత కార్మికులుగా గుర్తించి బడ్జెట్‌లో రూ. 1200 కోట్లు ప్రవేశపెట్టి ఆర్థిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని ప్రకటించడం సరికాదన్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ. 1200 కోట్ల ద్వారా ప్రతి పద్మశాలి కుటుంబానికి లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడం బాబురావు, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments