Home జగిత్యాల కలం కార్మికులకు అండగా ఉంటాం

కలం కార్మికులకు అండగా ఉంటాం

The main role of the journalists is the CM's leadership

జర్నలిస్టు కాలని డబుల్ బెడ్రూమ్‌లకు శంకుస్థాపన
నిజామాబాద్ ఎంపి కవిత

మనతెలంగాణ/ కోరుట్ల: తెలంగాణలోని కలం కార్మికులకు తాము అండగాఉంటామని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కోరుట్ల పట్టణ శివారులో ఏర్పాటు చేసిన జర్నలిస్టు కాలనీలో నిర్మించనున్న డబుల్ బెడ్ రూంలకు సోమవారం ఎంపి కవిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమమే లక్షంగా సిఎం సారథ్యంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం వినూత్నమై న పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు.రాష్ట్రంలోనే మొ ట్టమొదటిగా స్థానిక ఎంఎల్‌ఎకృషితో స్థలం సేకరించి జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూంలు నిర్మించడానికి పూ నుకోవడం అభినందనీయమన్నారు.దీనిని స్పూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరు ఈ కా ర్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతు రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి సిఎం కేసిఆర్ గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.
ఎంపి కవిత సహకారంతో రాష్ట్రంలో ఎక్కడ లేని వి ధంగా కోరుట్లలో జర్నలిస్టు కాలని నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రై తు సమన్వయ సమితి అధ్యక్షుడు చీటి వెంకట్‌రావు, మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్,మున్సిపల్ క మిషనర్ వాణిరెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కోరుట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.