Home వనపర్తి వ్యక్తి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పద మృతి

body2
మన తెలంగాణ/పెబ్బేరుః జాతీయ రహదారి పై గల రంగాపూర్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎస్‌ఐ ఒడి రమేష్ కథనం ప్రకారం గ్రామ సమీపంలోని  దాబా సమీపంలో 30 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి ముఖం పూర్తిగా కాలిపోయి ఉండడాన్ని గమానించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృత దేహంను పరిశీలిస్తే ఎవరో హత్యచేసి వ్యక్తి ముఖాన్ని కాల్చి ఉంటారని, మిగతా శరీర భాగం అంతా భాగానే ఉందని ఎస్‌ఐ తెలిపారు. నాలుక బయటికి రావడం, కళ్లు తేలి ఉండడాన్ని చూస్తే గొంతు నులిమి చంపారా అని అనుమానాలు వస్తున్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  ఎస్‌ఐ ఒడి.రమేష్ తెలిపారు.