Home సినిమా మెగా ఫ్యామిలీ ఎంత భయంకరంగా ఉందో చూశారా?

మెగా ఫ్యామిలీ ఎంత భయంకరంగా ఉందో చూశారా?

Mega Family Halloween Celebrations

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, మెగా ఫ్యామిలీ ఒకే ఫ్రేములో క‌న‌ప‌డ‌డం చాలా అరుదు అనే చెప్పాలి. తాజాగా మెగా ఫ్యామిలీలో ‘హాలోవీన్’ సందడి నెలకొంది. హాలోవీన్ అనగా చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు దెయ్యాలు, భూతాల వేషధారణలో అందరిని అలరిస్తుంటారు. ఈ నెల 31తో ‘హాలోవీన్’ వేడుకలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం విచిత్ర వేషధారణతో సందడి చేసింది. దీనిలో చిరు, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నిహారిక, సుస్మిత, శ్రీజ, కల్యాణ్ దేవ్, ఉపాసన తదితరులు వివిధ రకాల గెటప్‌లలో కనిపించి భయపెట్టారు.

రామ్ చరణ్ మాల ధరించి ఉండటంతో ఆయన సంప్రదాయ దుస్తుల్లోనే ఉన్నారు. ఇక 2016లో మెగా ఫ్యామిలీలోని వరుణ్ తేజ్, నిహారికలు దెయ్యాల గెటప్ లో కనిపించగా అల్లు అర్జున్ తనయుడు అయాన్ బ్యాట్ మన్ గెటప్ లో కనిపించి సందడి చేశాడు. గ‌త ఏడాది వ‌రుణ్ తేజ్ దెయ్యం గెట‌ప్‌లోకి మారి సంద‌డి చేశాడు. ఈ సారి మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం హాలోవీన్‌ని స‌ర‌దాగా సెల‌బ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ‘హాలోవీన్’ సందడిలో భాగంగా మెగాఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

The Mega Family Halloween Party Celebrations

Telangana Breaking News