Home హైదరాబాద్ కదులుతున్న… చెడ్డీ గ్యాంగ్ డొంక

కదులుతున్న… చెడ్డీ గ్యాంగ్ డొంక

members of the key gang were arrested

పట్టుబడిన కీలక ముఠా సభ్యులు
పరారీలో ఉన్నవారి కోసం ముమ్మర గాలింపు
గుజరాత్‌కు ప్రత్యేక బృందాలు
నగరంలో సంచరించిన 4 గ్యాంగ్‌లు
ముచ్చెమటలు పట్టించిన గ్యాంగ్

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఆ గ్యాంగ్ పేరు చెప్పితే చాలు… రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటిమీద కునుకుండదు. వారంటే పోలీసుల్లోనూ కొంత కలవరం. ఆ గ్యాంగ్ పేరే చెడ్డీ గ్యాంగ్ అలియాస్ కచ్చాబనియన్ గ్యాంగ్. రైళ్ళలో నగరానికి గ్యాంగ్‌లుగా చేరుకుంటారు. కలుసుకునే ప్రదేశాన్ని నిర్ణయించి ఓ కోడ్‌ను నామకరణం చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస దొం గతనాలు చేయడమే వీరి వృత్తి. పగటిపూట కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తారు. తాళాలు వేసిన ఇండ్లే వీరి లక్షం. సమీపంలోని చెట్లపొదలే వీరి స్థావరాలు. రాత్రివేళల్లోనే చోరీలకు పాల్పడుతారు.

ఈ గ్యాంగ్ సంచారంతో నగర శి వారు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తింది. ఇప్పుడు ఆ ముఠాల్లోని కీలక సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొంత ఉపశమనం కలిగించినట్లైంది. కేవలం మీర్‌పేట్‌లో జరిగిన దోపిడీలో దొరికిన ఆధారంతో ఆ గ్యాంగ్ మూలాలను కనుగొన్నది రాచకొండపోలీసు యంత్రాంగం. గత 20 రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో మకాం వేసిన రాచకొండ పోలీసులు చెడ్డిగ్యాంగ్‌లోని కీలక సభ్యులైన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో 8, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్‌లో 1, సైబరాబాద్ కమిషనరేట్‌లో 4, ఆంధ్రప్రదేశ్‌లో 15 కేసులు నమోదయ్యాయి.

కూలీలుగా నియామకం..
ప్రధానంగా గ్యాంగ్‌ను ముఠా నాయకుడు రాంజీ బాధ్య అనే ఘరానా దొంగ సాహడ గ్రామానికి చెందిన నిరుపేదలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకంచేసుకుంటాడు. దినసరి కూలీలుగా పనిచేయాలని సూచిస్తాడు. వారిని తీసుకుని గుజరాత్‌లోని సూరత్, డిల్లీ నగరాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లనే లక్షంగా చేసుకుని చోరీలు చేయాలని సూచిస్తాడు. వీరిని రైళ్ళలో పలు నగరాలకు తోలుకొని వెళ్ళి అక్కడ పగలు రెక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇళ్ళలోకి రాత్రి వేళల్లో చొరబాడుతారు. రామ్‌జీబాధ్య 2007 నుండి 2010 వరకు పనిచేసిన సురేష్, దినేష్‌లు 2010 అనంతరం సొంతంగా గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి తోడు మరో కిషన్ అనే నిందితుడు కూడా ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని దేశంలోని పలు నగరాలకు రైళ్ళలో వెళ్ళి అక్కడ దొంగతనాలు చేసి తిరిగి తమ స్వగ్రామమైన సాహోద్‌కు వెళ్తారు. వీరు ప్రధానంగా గుజరాత్, డిల్లీ, మహారాష్ట్ర, ఆ టంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని నగరాల్లో పలుమార్లు దొంగతనాలు, దోపిడీలు చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఆ గ్యాంగ్ చేసిన చోరీలు, దోపిడీల్లో భారీ మొత్తం పోకపోవడం కొంత ఊరట.

పక్కా ప్రణాళికతో..
వీరు రైళ్ళలో ఒకే మారు 34 గ్యాంగ్‌లు నగరానికి చేరుకుని సమీపంలోని చెట్లపొదలు, అటవీ భూములనే స్థావరాలుగా చేసుకుంటారు. పగటి వేళల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్ళను గుర్తిస్తారు. రాత్రి వేళ ల్లో ఎన్ని ఇండ్లలో చోరీచేసే అవకాశముందో అన్ని ఇండ్లలోనూ చొరబడుతారు. అనంతరం భారీగా నగదు, నగలు దొరికితే తిరిగి సొంత గ్రామానికి వెళ్ళిపోతారు. లేదంటే భారీగా దొరికే వరకు దొంగతనాలు చేస్తూనే ఉంటారు. వీరు వచ్చేముందే అందరూ కలుసుకునే ప్రదేశాన్ని కోడ్‌గా తెలుపుకుంటారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఆ ప్రాంతానికి రావాలి. వారు వచ్చాకనే అందరూ కలిసి తిరిగి తమ గ్రామాలకు వెళ్ళాలనేది వారి ఉద్దేశ్యం. వీరు పోలీసులకు దొరికితే విడిపించేందుకు ప్రత్యేకంగా ఓ లాయర్‌ను నియామకం చేసుకున్నారు. ఆ లాయర్ నగరానికి వచ్చి మరీ వారి తరపున నిలుస్తున్నారు.

రెండు సీజన్‌లలోనే చోరీలు..
చెడ్డీ గ్యాంగ్ ప్రధానంగా రెండు సీజన్‌లను చోరీలు చేసేందుకు వీలుగా ఎంపికచేసుకున్నాయి. ప్రధానంగా దీపావళికి రెండు నెలల ముందు, సంక్రాంతికి నెల 15 రోజుల ముందు ఇళ్ళల్లో దొంగతనాలకు నగరానికి చేరుకుంటారు. వీరిలో ప్రధానంగా ముఠా నాయకులైన రామ్‌జీబాధ్య, దినేష్‌లు తాళాలను పగలగొట్టడంలో నేర్పరులు. ఒక చిన్న ఇనుపరాడ్‌ను తమవెంట తీసుకుని వెళ్తారు. ఎలాం టి కిట్ బాక్స్‌లు, టూల్స్ ఉండవు. వీరు పొదల్లోనే ఉండి రాత్రి వేళల్లో తమ వస్త్రాలను ఒక టవాల్‌లో చుట్టి నడుముకు కట్టుకుంటారు. శరీరానికి నూనెలు రాసుకుంటారు. చెప్పులు చేతపట్టుకుంటారు. కర్రలను కూడా వెంటతెచ్చుకుంటారు. ఒకరు దారిచూపుతూ ముందుకు నడుస్తుంటే ఇతరులు అతడిని అనుసరిస్తారు. తాళాలను పగలగొట్టగానే నేరుగా చొరబడి అవసరమనుకుంటే ఆహారాలు తిని నెమ్మదిగా బయటకు వస్తారు. వారికి ఎవరైనా ఎదురుపడినా, అడ్డుపడినా తీవ్రస్థాయిలో దాడికి దిగుతారు.భారీగా దొంగతనం చేయడమే ఉద్దేశ్యం.

4 గ్యాంగ్‌లపై కేసులే లేవు..
నగరంలో మొత్తం 4 చెడ్డీ గ్యాంగ్‌లు సంచారం చేస్తున్నట్టు రాచకొండ పోలీసులు వెల్లడిస్తున్నారు. రామ్‌జీబాడా, సురేష్, దినేష్, కిషన్‌లు ముఠా నాయకులుగా ఉన్నారు. వీరి ముఠాలో 3-4 మంది సభ్యులుగా ఉంటున్నారు. వీరి స్వగ్రామమైన సాహడలో పరిసర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌లలో వీరిపై ఎలాంటి కేసులు లేవు. దీంతో ఈ గ్యాంగ్ ముఠాను అరెస్టు చేసేందుకు సాహడకు వెళ్ళిన రాచ కొండ పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్కడి పోలీసులు సైతం నమ్మలేదు. వీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నేరాలు చేస్తున్నారా..? అంటూ విస్తూపోయారు. రాచ కొండ ఎస్‌ఓటి పోలీసు బృందానికి నాయకత్వం వహిస్తున్న రవికుమార్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని సాంకేతిక పరమైన ఆధారాలను సేకరించడం, వారి కదలికలను పసిగట్టడంపై దృష్టి సారించి అన్ని రకాల ఆధారాలతో ఆ ముఠాల్లోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేయడం జరిగింది.

దొరికింది ఇలా..
2014లో మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కేసులో రామ్‌జీబాధ్య అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పుడు ఇతడే ముఠా నాయకుడని ఆధారాలు లభిం చలేదు. అనంతరం 2017లో మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దోపి డీలో దినేష్ అనే నిందితుడు దొరికాడు. అక్కడ దొరికిన వేలి ముద్రలు, సిసిటివి ఫుటేజీలు, గతంలో పట్టుబడిన రామ్‌జీబాడా వేలిముద్రలు, చిత్రాలు సరిపోలా యి. దినేష్ ఇచ్చిన సమాచారంతో వారి చోరీల పద్దతి వెల్లడైంది. రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వేట ప్రారం భించారు. గత సెప్టెంబర్‌లో జరిగిన దోడీలో చెడ్డీ గ్యాంగ్ కీలక ఆధారాలు సేక రించడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి తోడు చెడ్డీ గ్యాంగ్ బాధితురాలు అరుణ నేరుగా ప్రతి ప్రజాదర్బార్ కార్యక్రమంలో తమ కేసు పురోగతి ఏమిటని ప్రశ్నించడంతో కమిషనర్ మహేశ్‌భగవత్ సవాల్‌గా తీసుకుని దర్యాప్తును మరిం త ముమ్మరం చేశారు. గుజరాత్‌లో గత ఆరుమాసాలుగా గాలింపును మొద లుపెట్టారు. ప్రస్తుతం ప్రధాన నిందితులైన రామ్‌జీబాధ్య, సురేష్, దినేష్‌లు పరా రీలో ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం దాహోడ్ జిల్లా గరబడ మండలం సాహడ గ్రామానికి చెందిన బంధువులే అయిన ముఠా సభ్యులు పారమూర్ కిషన్ బాధ్య, పరమూర్ రావోజి బాధ్య, గనవ భరత్‌సింగ్‌లను అరెస్టు చేశారు. మిగతా వారిని పట్టుకునేందుకు బృందాల అన్వేషణ కొనసాగిస్తున్నారు.

పిడి యాక్ట్..?
ప్రస్తుతం నగరంలో సంచరించినట్టుగా భావించిన 4 ముఠాలోని 15మంది సభ్యులపై పిడి యాక్ట్‌ను తెరవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగ వత్ సూచన ప్రాయంగా వెల్లడించారు. వీరంతా దేశ వ్యాప్తంగా ఏఏ నగరాల్లో చోరీలకు పాల్పడ్డారో వివరాలు తీసుకుని వారందరిపైనా పిడి యాక్ట్‌న ప్రయో గించడం ద్వారా వీరి కదలికలకు పుల్‌స్టాప్‌పెట్టాలని కమిషనర్ వెల్లడించారు.

రెండుమాసాలుగా..
చెడ్డీగ్యాంగ్ ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా 60 రోజులు సహడ, దాహోడ ప్రాం తాల్లోనే మకాం వేశాం. వారికి ఫోన్‌ల సమాచారం చాలా తక్కువ. సాంకే తికంగా ఆధారాలను సేకరించేందుకు చాలా రోజులు పట్టింది. నిందితులు వీరే నని నిర్ధారించుకుని మరీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. స్థానిక పోలీసులు చాలా ఆశ్చర్యపోయారు. వారి వద్ద కేసులు లేనందున నిందితులను పట్టు కోవడం క్లిష్టతరమైంది. ప్రధాన నిందితుడైన రామ్‌జీ బాధ్య వద్దనే వీరి చోరీ సొత్తున్నదనేది దర్యాప్తులో వెల్లడైంది. గాలింపులు కొనసాగుతున్నాయి.