Home నిర్మల్ అధికారుల తీరుపై మంత్రి అసహనం

అధికారుల తీరుపై మంత్రి అసహనం

sit

*డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష
*పాల్గొన్న స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగడంతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లా కలెక్టర్, హౌజింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గృహనిర్మాణ శాఖ స్ఫెషల్ సిఎస్ చిత్రరామచంద్రన్ హాజరయ్యారు. ముందుగా జిల్లాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై అడిగి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉండడంతో చిత్రరామచంద్రన్ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పనులు మందకొడిగా జరుగడంతో అధికారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్‌లకు బిల్లులు కూడా త్వరగానే వస్తున్నందున కాంట్రాక్టర్లతో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడాలన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్‌లపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న విషయాన్ని అధికారులు గమణించాలన్నారు. పనుల జాప్యం ఎక్కడ జరుగుతుందో అని పైఅధికారులు క్రింది స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. ఎక్కువ వ్యయం కావడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని వారి దృష్టికి తీసుకుచ్చారు. కొన్ని జిల్లాలలో టెండర్లు పూర్తైన్నప్పటికీ పనులు ఎందుకు జరుగడం లేదని అడిగి తెలుసుకున్నారు. టెండర్లు పూర్తైన వాటిలో ప్రిల్ వరకు పనులు ప్రారంభించాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జిల్లాలో ఇలా పనులు జరుడకపోవడం విడ్డూరం అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ చొరవతోనే నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూంల పనులు చకచక జరుగుతున్నాయన్నారు. వేరే జిల్లాల్లో ఇళ్లు పూర్తి అవుతున్నప్పటికీ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్షం వలనే పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ల ప్రశాంతి సిఎస్ చిత్రరామచంద్రన్‌కు మొక్కలను అందజేశారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్‌పి చైర్మన్ శోభాసత్యనారాయణగౌడ్, ఎంఎల్‌ఎ రేఖాశ్యాంనాయక్, ఎంపిపి దౌలన్‌బికి కొయ్యబొమ్మలను అందజేశారు. అంతే కాకుండా దుబాయ్‌లో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.10లక్షల ఇన్సూరెన్స్ చెక్కును మంత్రి ఇంద్రకరన్‌రెడ్డి అందజేశారు.